Advertisement

  • అమిత్ షాకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు

అమిత్ షాకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు

By: chandrasekar Thu, 03 Sept 2020 09:30 AM

అమిత్ షాకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు


కరోనా కారణంగా అనారోగ్యం పాలైన కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా ఆరోగ్యం గురించి ఫోన్ లో తెలుగు దేశం నేత చంద్రబాబు నాయుడు మాట్లాడి పరామర్శించారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేత మరియు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు మరియు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అమిత్‌షాకు ఇటీవలే కరోనా సోకిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందిన ఆయన కోలుకుని ఇటీవలే ఇంటికి చేరుకున్నారు.

శ్వాస సంబంధిత అనారోగ్యం వల్ల మళ్ళి హాస్పిటల్లో చేరారు. ఇందుకుగాను ఆయనను పరామర్సించుటకు చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని అమిత్‌షా చంద్రబాబుకు తెలిపారు. దీంతో అయన పూర్తిగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తొందరగా కోలుకుని ప్రజలకు సేవ చేయాలనీ అయన వేడుకున్నారు.

ఆగస్టు 2వ తేదీన అమిత్ షా కరోనా వైరస్ బారిన పడి పాసిటివ్ గా గుర్తించబడ్డారు. దీంతో గురుగ్రామ్‌లో వేదాంత ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు. ఆగస్టు 14న అమిత్ షాకు నెటిగివ్ రావడంతో డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే శ్వాసకోస, తదితర అనారోగ్య పరిస్థితులు తలెత్తడంతో ఆగస్టు 18న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. అక్కడ చికిత్స పొందిన అమిత్‌షాకు ఆరోగ్యం మెరుగుకావడంతో ఆగస్టు 31న ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అమిత్‌షాకు చంద్రబాబు ఫోన్ చేసి ఆరోగ్య బాగోగుల గురించి తెలిసికున్నారు.

Tags :
|

Advertisement