Advertisement

  • ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచ్చర్‌కు షాక్ ఇచ్చిన ఈడీ

ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచ్చర్‌కు షాక్ ఇచ్చిన ఈడీ

By: chandrasekar Tue, 08 Sept 2020 10:29 AM

ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచ్చర్‌కు షాక్ ఇచ్చిన ఈడీ


ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టు చేసింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్ల కింద ఆయనను అరెస్టు చేసినట్టు అధికారులు సోమవారం తెలియచేసారు. వీడియోకాన్‌ గ్రూపునకు రూ.1,875 కోట్ల రుణాలను మంజూరు చేయడంలో అక్రమాలకు, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొచ్చర్‌ దంపతులను ఈడీ చాలా కాలం నుంచి ప్రశ్నిస్తున్నది.

ఈ వ్యవహారంలో కొచ్చర్‌ దంపతులతోపాటు వీడియోకాన్‌ గ్రూప్‌ అధినేత వేణుగోపాల్‌ ధూత్‌పై గతేడాది ఆరంభంలో కేసు నమోదైంది. ఈ కేసులో కొచ్చర్‌ దంపతులతోపాటు వారి కంపెనీల ఆధీనంలోని రూ.78 కోట్ల విలువైన ఆస్తులను ఈ ఏడాది ఆరంభంలో ఈడీ జప్తు చేసింది. సోమవారం మధ్యాహ్నం నుంచి దీపక్‌ కొచ్చర్‌ను ఈడీ మరోసారి ప్రశ్నించి రాత్రి ఆయనను అరెస్టు చేసింది.

Tags :
|
|

Advertisement