Advertisement

  • బిగ్‌బాస్ నాలుగో సీజన్‌‌కు విజయ్ దేవరకొండ హోస్ట్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉందట

బిగ్‌బాస్ నాలుగో సీజన్‌‌కు విజయ్ దేవరకొండ హోస్ట్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉందట

By: chandrasekar Wed, 08 July 2020 4:38 PM

బిగ్‌బాస్ నాలుగో సీజన్‌‌కు విజయ్ దేవరకొండ హోస్ట్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉందట


బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఇప్పటి వరకు తెలుగులో మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ షో తెలుగులో ఎంత ఆదరణ దక్కించుకుందంటే బిగ్ బాస్ ధాటికి కొన్ని సినిమాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. అంతలా ఆకట్టుకుంది ఈ షో. ఇక బిగ్ బాస్ పోయిన సీజన్‌ను నాగార్జున హోస్ట్ చేయ్యగా రెండవ సీజన్‌ను నాని, మొదటి సీజన్‌ను ఎన్టీఆర్‌ హోస్ట్‌గా అదరగొట్టారు తమ యాంకరింగ్‌తో సందడి చేశారు.

ఇక నాల్గవ సీజన్ గురించి మాట్లాడితే కరోనా లేకపోయినట్లైతే ఇప్పుటికే ఈ షోకు సంబందించిన సన్నాహాలు, హాడావిడి జరుగుతుండేది. గత మూడు సీజన్‌లను చూసినట్లయితే బిగ్ బాస్ షో మార్చి ఏప్రిల్‌ నుండే ఏర్పాట్లు ప్రారంభం అవ్వుతుండేవి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్‌బాస్‌ షో ఉంటుందా అసలు ఉండదా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.

తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ షో నిర్వాహకులు కొత్త సీజన్ ‌కోసం సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాదు ఈ సీజన్‌లో పాల్గొనే వారు కూడా కొంతమంది ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా హైపర్ ఆది, మంగ్లీ, తరుణ్, నందు, యాంకర్ ఝూన్సీ, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ షో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు నుండి ప్రారంభంకానుందని తెలుస్తోంది. మరోవైపు నాలుగో సీజన్‌‌కు కూడా నాగార్జున మరోసారి హోస్ట్‌గా చేసే అవకాశం ఉందని ఇటీవల వార్తలు రాగా లేటెస్ట్ సామాచారం మేరకు ఈ షోకు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హోస్ట్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉందట.

బిగ్ బాస్ నిర్వాహకులు ఈ విషయంలో విజయ్‌ను అడగడం ఆయన కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఒక వేళా బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌కు విజయ్ దేవరకొండ హోస్ట్‌గా వస్తే ఆ రియాలిటీ షోకు మరింత క్రేజ్ ఏర్పడే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని సినీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

Tags :
|
|

Advertisement