Advertisement

  • ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం

By: chandrasekar Wed, 15 July 2020 8:40 PM

ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం


మూడు రోజుల‌ పాటు ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం జార్ఖండ్, ఆ రాష్ట్ర పరిసర ప్రాంతాల్లో 1.5 కిలో మీటర్ల నుంచి 7.6 కి.మీ. మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉంద‌ని వివరించింది.

సముద్ర తీరంలో ఏర్పడిన గాలుల కలయిక ప్రభావంతో ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 3.6 కి.మీ నుంచి 4.5 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అలాగే నైరుతి రుతుపవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

దీని ప్రభావంతో మ‌రో రెండు రోజుల‌ పాటు రాష్ర్టవ్యాప్తంగా తేలిక‌పాటి నుంచి ఓ మోస్తారు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మ‌రో రెండు రోజుల‌ పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Tags :
|
|

Advertisement