Advertisement

  • బుమ్రా కంటే తక్కువ మ్యాచ్ లలో ఆ రికార్డు సమం చేసిన చాహల్

బుమ్రా కంటే తక్కువ మ్యాచ్ లలో ఆ రికార్డు సమం చేసిన చాహల్

By: Sankar Sun, 06 Dec 2020 10:01 PM

బుమ్రా కంటే తక్కువ మ్యాచ్ లలో ఆ రికార్డు సమం చేసిన చాహల్


ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా స్సిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ వికెట్‌ తీశాడు. తొలి టీ20లో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన చహల్‌ మూడు వికెట్లతో రాణించాడు.

ఈరోజు జరిగిన మ్యాచ్‌లో స్టీవ్‌ స్మిత్‌ వికెట్‌ను చహల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. స్మిత్‌ మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఔట్‌ చేసి మంచి బ్రేక్‌ ఇచ్చాడు. 18 ఓవర్‌ ఐదో బంతికి స్మిత్‌ను పెవిలియన్‌కు పంపాడు చహల్‌. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో 59వ వికెట్‌ను సాధించాడు. ఈ క్రమంలోనే భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో జస్‌ప్రీత్‌ బుమ్రాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.

అయితే ఈ ఫీట్‌ను బుమ్రా కంటే వేగంగా చహల్‌ సాధించడం విశేషం. బుమ్రా ఇప్పటివరకూ 49 మ్యాచ్‌లు ఆడి 59 వికెట్లు సాధించగా, చహల్‌ 44 మ్యాచ్‌ల్లో 59 వికెట్లను సాధించాడు. దాంతో బుమ్రా కంటే వేగంగానే చహల్‌ 59వ అంతర్జాతీయ టీ20 వికెట్‌ మార్కును చేరాడు

Tags :
|
|
|
|

Advertisement