Advertisement

  • తెలంగాణ వ్యాప్తంగా వరద బాధితుల వివరాలు సేకరణ కోసం కేంద్ర బృందం పర్యటన

తెలంగాణ వ్యాప్తంగా వరద బాధితుల వివరాలు సేకరణ కోసం కేంద్ర బృందం పర్యటన

By: chandrasekar Fri, 23 Oct 2020 09:17 AM

తెలంగాణ వ్యాప్తంగా వరద బాధితుల వివరాలు సేకరణ కోసం కేంద్ర బృందం పర్యటన


భారీ వర్షాలతో అతలా కుతలమైన తెలంగాణా రాష్ట్రాన్ని కేంద్ర బృందం పర్యటిస్తుంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాలు నేటికీ వరదలు కొనసాగుతున్నాయి. ఎన్నో కాలనీల్లో నీరు ఇప్పటికి ఇళ్లల్లోకి చేరుకుంటోంది. ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ జలగండం నుంచి నగరాన్ని గట్టెక్కించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా కేంద్రం నుంచి ఒక బృందం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఈ బృందంలో జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ వశిష్ట తో పాటు మరికొంత మంది అధికారులు ఉన్నారు.

రాష్ట్రంలో ఏర్పడ్డ నష్టాలను గుర్తించి కేంద్రానికి సమర్పించనుంది. ఈ బృందం రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తుంది. భాగ్యనగరంతో పాటు ప్రభావిత జిల్లాల్లో పర్యటించి ఏ మేరకు నష్టం కలిగింది అనేది తన నివేదికలో కేంద్రానికి తెలియజేస్తుంది. ఈ నివేదికలో భారీ వర్షాలు, వరదల వల్ల పంటలకు ఏ మేరకు నష్టం కలిగిందో కూడా కేంద్రం తన నివేదికలో ప్రస్తావిస్తుంది. కేంద్ర బృందంతో నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు పలువురు అధికారులు సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర బృందం హైదరాబాద్ నగరంలో పర్యటిచింది. ఈ సందర్భంగా పలువురు నేతలు, అధికారులు స్థానిక పరిస్థితుల గురించి వివరించారు. ఈ వివరాలు ఆధారంగా రాష్ట్రానికి కావలసిన నిధులను అందిస్తారు.

Tags :

Advertisement