Advertisement

  • తమిళనాడులో కరోనా తీవ్రతపై కేంద్ర బృందం సమీక్ష..

తమిళనాడులో కరోనా తీవ్రతపై కేంద్ర బృందం సమీక్ష..

By: Sankar Fri, 10 July 2020 3:41 PM

తమిళనాడులో కరోనా తీవ్రతపై కేంద్ర బృందం సమీక్ష..



తమిళనాడు రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తుండడంతో పరిస్థితిపై చర్చించేందుకు శుక్రవారం చెన్నైలో కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి ఆర్తీ అహుజా నేతృత్వంలో ఆ రాష్ట్ర సీఎం యడప్పాడి పళనిస్వామి కేంద్ర బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కేంద్రం బృందం సీఎంతో సమీక్షించింది.

రాష్ట్ర రాజధాని చెన్నైలో అధికంగా కేసులు నమోదవుతుండడానికి గల కారణాలు అడిగి తెలుసుకుంది. అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగం, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి రామకృష్ణన్‌తోపాటు సీనియర్‌ అధికారులతో కేంద్రం బృందం సభ్యులు సమావేశమయ్యారు. దేశంలో మహారాష్ట్ర తరువాత అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నది తమిళనాడు రాష్ట్రంలోనే. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 1,26,581 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ తన నివేదికలో వెల్లడించింది.

కాగా దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు తమిళనాడులోనే నమోదు అవుతున్నాయి ..మరణాలు కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నాయి ..ముఖ్యంగా రాజధాని చెన్నై కరోనా కేసులతో అతలాకుతలం అవుతుంది..మల్లి లాక్ డౌన్ విధించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు ..

Tags :
|
|
|
|
|

Advertisement