Advertisement

  • రైతులకు రక్షణ కలిపించే అంశాలే చట్టంలో పొందుపరిచాము..వ్యవసాయ మంత్రి

రైతులకు రక్షణ కలిపించే అంశాలే చట్టంలో పొందుపరిచాము..వ్యవసాయ మంత్రి

By: Sankar Thu, 10 Dec 2020 10:05 PM

రైతులకు రక్షణ కలిపించే అంశాలే చట్టంలో పొందుపరిచాము..వ్యవసాయ మంత్రి


రైతులకు రక్షణ కల్పించే అంశాలను చట్టంలో పొందుపరిచినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ తెలిపారు. కాంట్రాక్ట్ వ్యవసాయంలో రైతుల భూమికి రక్షణ ఉంటుందని అన్నారు.

వ్యవసాయ చట్టాల వళ్ళ రైతులు లభ్ది పొందుతున్నారని తెలిపారు. కానీ, పంజాబ్ సహా కొన్ని రైతు సంఘాలు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ 8 వరకు ఆరుసార్లు చర్చలు జరిపామని రైతులు లేవనెత్తిన అభ్యంతారాలపై కేంద్రం ప్రతిపాదనలు పంపిందని కానీ, రైతులు చట్టాలను మొత్తం రద్దు చేయమంటున్నారని అన్నారు.

రైతుల సమస్యలు పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, మార్కెట్ వ్యవస్థలో ఉన్న అపోహలు తొలగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తోమర్ పేర్కొన్నారు.గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ వ్యవసాయం అమలౌతోందని, ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని అన్నారు.

Tags :
|

Advertisement