Advertisement

  • రాజకీయ దిగ్గజం , కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి

రాజకీయ దిగ్గజం , కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి

By: Sankar Thu, 08 Oct 2020 9:47 PM

రాజకీయ దిగ్గజం , కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి


భారతీయ రాజకీయ దిగ్గజం, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం పాలైన ఆయనకు ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.తన తండ్రి మృతి చెందినట్లు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ప్రస్తుత వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా ఉన్న పాశ్వాన్ . పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు. ఎనిమిది సార్లు లోక్‌సభ సభ్యునిగా, మూడు సార్లు రాజ్యసభ సభ్యునిగా పని చేసారు.

పాశ్వాన్‌ ప్రస్తుత వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా ఉన్నారు. 2010 నుండి 2014 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్న తరువాత 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో హాజీపూర్ నియోజకవర్గం నుండి 16వ లోక్‌సభ తిరిగి ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగున్నారు. మొత్తం ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1946 జూలై 5న బిహార్‌లో జన్మించిన పాశ్వాన్‌.. 2000లో లోక్‌ జనశక్తి పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగంగా కేంద్రమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. కాగా రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు తమ సంతాం వ్యక్తం చేశారు.

ప్రధాని మోడీ సంతాపం తెలుపుతూ రామ్‌విలాస్‌ పాశ్వాన్ ఇక లేరన్న వార్త నన్ను దిగ్ర్బాంతికి గురిచేసింది. పాశ్వాన్‌ మృతితో ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను. పేదల కోసం అహర్నిశలు శ్రమించారు. ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగానూ లోటుగా అనిపిస్తుంది. తాను ఓ మంచి స్నేహితుడిని, సహచరుడిని పేదల కోసం ఆలోచించే వ్యక్తిని కోల్పోయాను అని అన్నారు..

Tags :
|

Advertisement