Advertisement

  • హైదరాబాద్ లో గుంతలు లేని రోడ్లు చూయించగలరా ...కిషన్ రెడ్డి

హైదరాబాద్ లో గుంతలు లేని రోడ్లు చూయించగలరా ...కిషన్ రెడ్డి

By: Sankar Sun, 08 Nov 2020 8:12 PM

హైదరాబాద్ లో గుంతలు లేని రోడ్లు చూయించగలరా ...కిషన్ రెడ్డి


తెలంగాణపై ప్రధాని మోదీ వివక్ష చూపిస్తున్నారని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు.

వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదికలు పంపలేదు అని ఆయన అన్నారు. తాడ్‌బండ్ సిక్‌ విలేజ్ హాకీ గ్రౌండ్స్‌లో ఆదివారం బీజేపీ ఏర్పాటు చేసిన సభకు కిషన్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డ్ వైస్ ఛైర్మన్ రామకృష్ణ, బానుక మల్లికార్జున్, పలువురు టీఆర్ఎస్ నాయకులు కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

పేదలకు ఎన్ని డబుల్ బెడ్రూం ఇచ్చాడో కేటీఆర్ చెప్పాలి. పేదలకు ఇవ్వాల్సిన రూ. 10,000లను కూడా కేటీఆర్ అనుచరులు తన్నుకుపోతున్నారు. హైదరాబాద్‌కు సముద్రాన్ని తెచ్చిన ఘనత కేసీఆర్‌దే. హైద్రాబాద్‌లో గుంతలు లేని రోడ్లు కేటీఆర్ చూపించగలడా?. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్‌కు లేదు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే వందల కాలనీలు నీట మునిగాయి. ప్రజలకు అబద్దాలు, అవాస్తవాలు చెప్పటం కేటీఆర్‌కు అలవాటుగా మారింది అని అన్నాడు కేంద్ర మంత్రి..

Tags :
|

Advertisement