Advertisement

  • చర్చలపై కేంద్రం రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తోంది ...రైతు సంఘాలు

చర్చలపై కేంద్రం రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తోంది ...రైతు సంఘాలు

By: Sankar Mon, 28 Dec 2020 10:15 PM

చర్చలపై కేంద్రం రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తోంది ...రైతు సంఘాలు


తమ అజెండాను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని రైతు సంఘాలు మండిపడ్డాయి. అజెండాపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. చర్చలపై కేంద్రం రెండు నాలుకల ధోరణి అవలంభిస్తోందని ధ్వజమెత్తాయి.

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలను రోజురోజుకు ఉద్ధృతం చేస్తాం. హరియాణాలో టోల్‌ చెల్లింపు నిరాకరణ కొనసాగుతోంది. కార్పోరేట్‌ ఉత్పత్తుల బహిష్కరణ కొనసాగుతోంది. జనవరి 1వ తేదీన ప్రజలు రైతులకు మద్ధతుగా ప్రమాణం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 30వ తేదీన సింఘు సరిహద్దు వద్ద ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

కాగా గత కొంతకాలముగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల మీద రైతు సంఘాలు ఢిల్లీలో తీవ్ర నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే..ఇప్పటికే కేంద్రంతో అనేక సార్లు రైతు సంఘాలు చర్చలు జరిపినప్పటికీ అన్ని విఫలం అయ్యాయి

Tags :

Advertisement