Advertisement

  • ఇక నుంచి ప్రతి కారులో ఆ రెండు సీట్లకు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి ..కేంద్రం కీలక నిర్ణయం

ఇక నుంచి ప్రతి కారులో ఆ రెండు సీట్లకు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి ..కేంద్రం కీలక నిర్ణయం

By: Sankar Tue, 29 Dec 2020 6:30 PM

ఇక నుంచి ప్రతి కారులో ఆ రెండు సీట్లకు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి ..కేంద్రం కీలక నిర్ణయం


కారులో ప్రయాణం అత్యంత సౌకర్యంగా ఉంటుంది ..కుటుంబం మొత్తం ఎక్కడికయినా వెళ్లాలంటే కారుని మించిన ప్రత్యామ్నాయం ఇంకోటి ఉండదు ..అయితే గంటకు 100 కిలో మీటర్లకుకు పైగా వేగంతో వెళ్లే కార్లకు ప్రమాదాలు జరిగితే అంతే స్థాయిలో ప్రాణాలు కూడా పోతున్నాయి..అందుకే మోటార్ వాహనాల చట్టంలో కేంద్రం కీలక మార్పులు చేసింది.

ప్రయాణికుల వాహనంలో ముందు రెండు సీట్లకు తప్పనిసరిగా ఎయిర్ బ్యాగ్ లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా వచ్చే అన్ని మోడళ్ల వాహనాలకు ఈ నియమాన్ని పాటించాలని స్పష్టం చేసింది. 2021 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇక పాత వాహనాల విషయంలో కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

పాత వాహనాల ముందు రెండు సీట్లకు ఎయిర్ బ్యాగ్ లు అమర్చుకోవడానికి జూన్ 1 వరకు గడువు ఇస్తున్నట్టు కేంద్రం తెలియజేసింది. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో కారులో ఎయిర్ బ్యాగ్ లు లేకపోవడం వలన ఎక్కువ మంది మృతి చెందుతున్నారు. దీంతో కేంద్రం కార్లలో ఎయిర్ బ్యాగ్ లను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నది.

Tags :
|

Advertisement