Advertisement

పార్కులలో సిసిటివి కెమెరాలు ... ఎందుకో తెలుసా !

By: Sankar Fri, 16 Oct 2020 07:49 AM

పార్కులలో సిసిటివి కెమెరాలు ... ఎందుకో తెలుసా !


వినోదపు పార్కులు, ఫుడ్‌కోర్టుల్లో సీసీటీవీలు ఏర్పాటుచేసి సందర్శకులు గుంపుగా ఒకేచోటకు చేరకుండా పర్యవేక్షించాలని కేంద్ర ప్రభు త్వం ఆదేశించింది. కరోనా కంటైన్మెంట్‌ ఏరియాల్లో వినోదపు పార్కులు తెరవ కూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది..

కరోనా వ్యాప్తి జరగకుండా వినోదపు పార్కుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వినోద కేంద్రాలకు, పార్కుల్లోకి సందర్శకులు విశ్రాంతి, వినోదం కోసం పెద్దసంఖ్యలో వస్తారు. కాబట్టి కరోనా నివారణ చర్యలు పాటించడం చాలా ముఖ్యమని నొక్కిచెప్పింది.

1.పార్కుల్లో పనిచేసే వారిలో అనారోగ్యంతో ఉన్నవారు, వయసు పైబడిన, గర్భిణులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేకుండా విధులు నిర్వహించాలి.

2. ఫుడ్‌కోర్టులు ఇతర చోట్ల రద్దీని గుర్తించడానికి సీసీటీవీలతో పర్యవేక్షించాలి.

3. ప్రాంగణం లోపల, వెలుపల భౌతికదూరాన్ని పాటించేలా నేలపై నిర్ధిష్ట గుర్తులుపెట్టాలి. ప్రాంగణం లోపల, వెలుపల క్యూ పాటించాలి. క్యూ, భౌతికదూరం పర్యవేక్షణకు తగినంత మంది సిబ్బందిని నియమించాలి.

4. ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం కంటే ఎక్కువ సీటింగ్‌ సామర్థ్యం అనుమతించకూడదు. ఫుడ్‌కోర్టు సిబ్బంది లేదా వెయిటర్లు మాస్క్‌లు, గ్లోవ్స్‌ ధరించాలి.

5.మ్యూజియంలు, ఉద్యానవనాలు, ఫుడ్‌ కోర్టులు, థియేటర్లు మొదలైన వాటితో పాటు డోర్‌ హ్యాండిల్స్, ఎలివేటర్‌ బటన్లు, కుర్చీలు, బెంచీలు, అంతస్తులు, గోడలు మొదలైనవాటిని సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రపరచాలి.

6. ఆన్‌లైన్‌ టిక్కెట్‌ సదుపాయాన్ని ప్రోత్సహించాలి. టికెట్లు జారీ చేసేటప్పుడు చేయవలసిన, చేయకూడని సూచనలతో కూడిన కరపత్రాలు పంచాలి. లేదా టికెటట్లపైనే వాటిని ముద్రించవచ్చు.

7.పార్క్‌ ప్రాంగణంలో కుర్చీలు, బెంచీలు మొదలైన వాటి మధ్య ఆరడుగుల దూరం ఉండాలి.

Tags :

Advertisement