Advertisement

  • ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు భూమి ప‌త్రాల‌ను అప్పగించిన కేంద్ర ప్ర‌భుత్వం‌

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు భూమి ప‌త్రాల‌ను అప్పగించిన కేంద్ర ప్ర‌భుత్వం‌

By: chandrasekar Thu, 05 Nov 2020 5:48 PM

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు భూమి ప‌త్రాల‌ను అప్పగించిన కేంద్ర ప్ర‌భుత్వం‌


టీఆర్ఎస్ ఆఫీసు నిర్మాణానికి దేశ రాజ‌ధాని ఢిల్లీలోని వ‌సంత్ విహార్‌లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్రం ప్రభుత్వం కేటాయించిన విష‌యం తెలిసిందే. ఆ భూమికి సంబంధించిన ప‌త్రాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రానికి అప్ప‌గించింది.

పార్టీ ఆఫీసు భూమి ప‌త్రాల‌ను రాష్ట్ర మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి అందుకున్నారు. త్వ‌ర‌లోనే పార్టీ కార్యాల‌యం నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేయ‌నున్నారు. ఒకప్పుడు ఢిల్లీలో తెలంగాణ ప్రాంతానికి ప్రతీకగా హైదరాబాద్‌ హౌజ్ ఉండేది.

ప్రతిష్టాత్మకమైన ఈ రాజ ప్రసాదం తదనంతర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయింది. హైదరాబాద్‌ హౌజ్‌ ఆనాటి చరిత్రకు ప్రతీక అయితే ఇప్పుడు ఏర్పాటు కానున్న టీఆర్‌ఎస్‌ భవన్‌ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణ ఉద్యమ పోరాటానికి ఆక్షాంక్షల సాఫల్యానికి అది సంకేతం. దేశంలోని అనేక ప్రాంతాల్లో అస్తిత్వ ఉద్యమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వెలిసే టీఆర్‌ఎస్‌ భవన్‌ నిలువెత్తు విజయంగా నిలిచి వారికి ఆదర్శంగా మారనున్నది.

Tags :
|
|

Advertisement