Advertisement

రెండురకాల ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి

By: chandrasekar Sat, 10 Oct 2020 5:15 PM

రెండురకాల ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి


కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నిత్యం 10 వేల క్వింటాళ్ల బెంగళూర్‌ గులాబీ రకం, కృష్ణాపురం రకాలను మార్చి 31 వరకు ఎగుమతి చేసుకోవచ్చని శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిని కేవలం చెన్నై ఓడరేపు ద్వారా మాత్రమే రవాణా చేయాలని షరతు విధించింది.

రైతుల ఆదాయం పెంచేందుకు వారు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్ర పీయూష్‌ గోయల్‌ ట్విట్టర్‌లో తెలిపారు.

ఎగుమతి చేసుకోవాలనుకునే వారు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ఉద్యానవన శాఖ అధికారుల నుంచి అనుమతి పొందాలని, ధ్రువీకరించిన నాణ్యమైన ఉల్లిని మాత్రమే ఎగుమతికి అనుమతిస్తామని తెలిపారు.

Tags :

Advertisement