Advertisement

  • తెలుగు రాష్ట్రాలలో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలుగు రాష్ట్రాలలో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

By: Sankar Mon, 26 Oct 2020 5:01 PM

తెలుగు రాష్ట్రాలలో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్


తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదాని నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నలిచ్చింది. ఈ రహదారితో హైదరాబాద్‌- తిరుపతి మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.

కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, ఆత్మకూరు, నంద్యాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ. 800 కోట్ల నిధులు ఖర్చు చేయనుంది. తెలంగాణలో 86 కిలోమీటర్లు, ఏపీలో 26 కిలోమీటర్ల రహదారిని నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేస్తామని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

అంతకుముందు నితిన్‌గడ్కరీని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, నాగర్‌కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుధాకర్‌రావు, దిలీప్ ఆచారి కలిశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి, కొల్లాపూర్, నంద్యాలను కలిపే జాతీయ రహదారిని మంజూరు చేసినందుకు బీజేపీ నేతల బృదం కృతజ్ఞతలు తెలిపింది.

Tags :

Advertisement