Advertisement

  • గ్యాస్‌ కొనుగోలుకు అనుబంధ సంస్థలను అనుమతి౦చిన కేంద్ర౦

గ్యాస్‌ కొనుగోలుకు అనుబంధ సంస్థలను అనుమతి౦చిన కేంద్ర౦

By: chandrasekar Thu, 08 Oct 2020 4:51 PM

గ్యాస్‌ కొనుగోలుకు అనుబంధ సంస్థలను అనుమతి౦చిన కేంద్ర౦


కేంద్ర క్యాబినెట్‌ నియంత్రణలో లేని క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే గ్యాస్‌ కొనుగోలుకు అనుబంధ సంస్థలను అనుమతిస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇక్కడ ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్‌ కమిటీ సమావేశమైంది.

ఈ సందర్భంగా సహజ వాయువు మార్కెటింగ్‌ సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి సంస్థలకు గొప్ప ఉత్సాహాన్నిస్తుండగా, పూర్తి మార్కెటింగ్‌ స్వేచ్ఛను ఇవ్వడంలో భాగంగానే నాన్‌-రెగ్యులేటెడ్‌ ఫీల్డ్స్‌ నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌ను కొనేందుకు అనుబంధ సంస్థలకు అనుమతినిచ్చినట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ విలేఖరులకు తెలిపారు.

ఇక మీదట అనియంత్రిత క్షేత్రాల్లో ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌ను రిలయన్స్‌ తదితర సంస్థలు తమ అనుబంధ సంస్థలకు అమ్ముకోవచ్చన్నారు. అలాగే కెయిర్న్‌, ఫోకస్‌ ఎనర్జీ వంటి సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌కే కాకుండా ఎవరికైనా ఇంధనాన్ని విక్రయించుకోవచ్చని తెలిపారు.

Tags :
|

Advertisement