Advertisement

  • ఉత్తమ విద్యాసంస్థల ర్యాంకింగ్‌లను ప్రకటించిన కేంద్రం

ఉత్తమ విద్యాసంస్థల ర్యాంకింగ్‌లను ప్రకటించిన కేంద్రం

By: chandrasekar Sat, 13 June 2020 12:54 PM

ఉత్తమ విద్యాసంస్థల ర్యాంకింగ్‌లను ప్రకటించిన కేంద్రం


ఉత్తమ విద్యాసంస్థల ర్యాంకింగ్‌లను ప్రకటించిన కేంద్రం: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌కు దేశంలోని 15వ ర్యాంకు, 17వ స్థానంలో నిలిచిన ఐఐటీ హైదరాబాద్‌, లా విభాగంలో మూడో స్థానంలో, నల్సార్‌ ఫార్మసీలో ఎన్‌ఐఎఫ్‌ఈఆర్‌కు 5వ ర్యాంకు, 26 నుంచి 19వ ర్యాంకుకు వరంగల్‌ నిట్‌ ఓవరాల్‌గా అగ్రస్థానంలో ఐఐటీ మద్రాస్‌.

దేశంలోని అత్యుత్తమ 20 విద్యాసంస్థల్లో తెలంగాణకు చెందిన మూడు సంస్థలు చోటు దక్కించుకొన్నాయి. అన్ని విభాగాల ఓవరాల్‌ క్యాటగిరీలో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 15వ స్థానం, ఐఐటీ హైదరాబాద్‌ 17వ స్థానాన్ని చేజిక్కించుకొన్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ గురువారం నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేంవర్క్‌లో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు ర్యాంకులు ప్రకటించింది.

హెచ్చార్డీశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ అత్యున్నత ప్రమాణాలు గల విద్యాసంస్థల గ్రేడింగ్‌లను న్యూఢిల్లీలో విడుదల చేశారు. ఈ ర్యాంకుల్లో దేశంలోనే ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్‌ నిలిచింది. ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐటీ ఢిల్లీ ఆ తరువాతి స్థానాలను పొందాయి. ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్‌ యూనివర్సిటీ 8వ ర్యాంకులో నిలిచింది. ఓవరాల్‌ క్యాటగిరీలో వరంగల్‌ నిట్‌ 46వ స్థానంలో నిలువగా, ఉస్మానియా యూనివర్సిటీ 53వ స్థానాన్ని దక్కించుకొన్నది.

యూనివర్సిటీ విభాగంలో హైదరాబాద్‌ యూనివర్సిటీ ఏకంగా ఆరో ర్యాంకు సాధించి అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది. ఇదే విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ 29 వ స్థానంలో.. ఐఐఐటీ హైదరాబాద్‌ 78వ స్థానాన్ని దక్కించుకొన్నాయి. దేశవ్యాప్తంగా 200 యూనివర్సిటీల్లో హైదరాబాద్‌ యూనివర్సిటీ 15 వ స్థానంలో, యూనివర్సిటీ విభాగంలో ఆరో స్థానంలో నిలువడం సంతోషంగా ఉన్నదని సెంట్రల్‌ యూనివర్సిటీ ఉపకులపతి అప్పారావు అన్నారు. ప్రతిష్ఠాత్మక ఐఐటీ హైదరాబాద్‌ తన ర్యాంకును క్రితంసారికన్నా బాగా మెరుగుపరుచుకొన్నది. ఓవరాల్‌ క్యాటగిరీలో గతేడాది 22వ స్థానంలో ఉన్న ఐఐటీహెచ్ ఈసారి 17వ ర్యాంకుకు ఎగబాకింది.

announcing,best,educational,institutions,rankings ,ఉత్తమ, విద్యాసంస్థల, ర్యాంకింగ్‌లను, ప్రకటించిన, కేంద్రం


నాణ్యమైన విద్య, విస్తృతస్థాయి పరిశోధనలతో హైదరాబాద్‌ ఐఐటీ దేశాన్ని మెప్పిస్తున్నది. ఇంజినీరింగ్‌ విభాగంలో ఎనిమిదో ర్యాంకును పొందింది. జాతీయ ర్యాంకిగ్‌లలో మంచి స్థానాన్ని దక్కించుకొన్నందుకు ఆనందంగా ఉన్నదని ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి తెలిపారు. ఇంజినీరింగ్‌ విభాగంలో వరంగల్‌ నిట్‌ 19వ ర్యాంకు సాధించగా, ఐఐఐటీహెచ్‌కు 43, జేఎన్‌టీయూ హైదరాబాద్‌కు 57, యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌కు 88వ ర్యాంకు లభించాయి. న్యాయవిభాగంలో నల్సార్‌ న్యాయ కళాశాల మూడో ర్యాంకు తెచ్చుకొని దేశంలోనే ఉత్తమ న్యాయ కళాశాలగా నిలిచింది.

ఫార్మసీ విభాగానికి సంబంధించి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ హైదరాబాద్‌ ఐదోర్యాంకు సాధించింది. డెంటల్‌ విభాగంలో ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌కు 23వ ర్యాంకు రాగా, మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఐసీఎఫ్‌ఏఐ ఫౌండేషన్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌కు 25వ ర్యాంకు లభించింది. కాలేజీ విభాగంలో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌ 73వ ర్యాంకు వచ్చింది.

జాతీయస్థాయి అత్యున్నత ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నిట్‌ వరంగల్‌కు 19వ స్థానం లభించింది. టీచింగ్‌ అండ్‌ లెర్నింగ్‌ రిసోర్స్‌, పరిశోధన, విద్యా ప్రమాణాలు, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పాయింట్లు కేటాయించారు. ఈ విభాగాల్లో నిట్‌ 57.76 స్కోరుతో 19వ ర్యాంకు సాధించింది. గతేడాది ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో ఇంజినీరింగ్‌ విభాగంలో 53.12 స్కోరుతో 26 ర్యాంకు సాధించిన నిట్ ఈ ఏడాది 19వ ర్యాంకు సాధించడం సంతోషకరంగా ఉన్నదని ఎన్‌ఐటీ డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు తెలిపారు. నిట్‌ ఉద్యోగులు, అధ్యాపకుల సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

జాతీయస్థాయిలో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ విడుదలచేసిన ర్యాంకుల్లో అనురాగ్‌ విద్యాసంస్థలు మంచి ర్యాంకులు సాధించాయి. రాష్ట్రస్థాయిలో ఓవరాల్‌ విభాగంలో ఆరో ర్యాంకు, ఫార్మసీ విభాగంలో రెండో ర్యాంకు, ఇంజినీరింగ్‌ విభాగంలో 13వ ర్యాంకు ఈ సంస్థలకు లభించాయి. జాతీయ స్థాయిలో ఓవరాల్‌ విభాగంలో 151 - 200 బ్యాండ్‌ స్థానంలో నిలువగా, ఇంజినీరింగ్‌ విభాగంలో 180వ ర్యాంకును సాధించింది. ఫార్మసీ విభాగంలో జాతీయ స్థాయిలో 76-100 బ్యాండ్‌లో స్థానం దక్కించుకొన్నది. అనురాగ్‌ విద్యాసంస్థలు ఈ మధ్య కాలంలోనే యూనివర్సిటీగా మారిన సంగతి తెలిసిందే. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకులు సాధించడంలో కృషి చేసిన అధ్యాపకులను, విద్యార్థులను అనురాగ్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు.

Tags :
|

Advertisement