Advertisement

  • లాక్ డౌన్‌కు 5.0 కు కేంద్రం ప్రకటించిన సడలింపులు

లాక్ డౌన్‌కు 5.0 కు కేంద్రం ప్రకటించిన సడలింపులు

By: chandrasekar Sat, 30 May 2020 8:35 PM

లాక్ డౌన్‌కు 5.0 కు కేంద్రం ప్రకటించిన సడలింపులు


జూన్ 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్టు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, లాక్ డౌన్ 5.0 లో ప్రజలకు కొత్త మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి మరిన్ని సడలింపులను కల్పించింది. వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన నివేదికలను ఆధారంగా చేసుకుని కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగింది.

* ఆరోగ్య సేతు ఉపయోగం

ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్ అనేది కోవిడ్-19 బారిన పడిన వ్యక్తులను త్వరగా గుర్తించడానికి లేదా సోకిన ప్రమాదం ఉన్నవారిని త్వరగా గుర్తించడానికి భారత ప్రభుత్వం నిర్మించిన శక్తివంతమైన సాధనం, తద్వారా వ్యక్తులు మరియు సమాజానికి కవచంగా పనిచేస్తుంది. భద్రతను నిర్ధారించే ఉద్దేశ్యంతో, అప్లికేషన్ వాడకాన్ని ప్రోత్సహించాలని వివిధ అధికారులకు సూచించారు.

center,announced,easing,for,lockdown ,లాక్ డౌన్‌కు, కేంద్రం, ప్రకటించిన, సడలింపులు, జూన్


లాక్ డౌన్‌కు 5.0 కు సంబంధించి కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలు క్రింది విధంగా...

* లాక్‌డౌక్‌ నేపథ్యంలో రెండు నెలలుగా మూతబడ్డ అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైళ్లు, సినిమా హాల్స్‌, జిమ్‌లు, బార్లు, స్విమ్మింగ్ పూల్స్‌, ఆడిటోరియంల ప్రారంభంపై త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

* కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ జూన్ 3 వరకు కొనసాగుతుంది.

* అలాగే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మతపరమైన కార్యకలాపాలపై కూడా త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది.

* కంటైన్మెంట్ జోన్ పరిధిని జిల్లా యంత్రాంగం నిర్దేశిస్తుంది. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ద్వారా జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి.

* కర్ఫ్యూను రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కుదించింది.

* కంటైన్మెంట్ జోన్లలో కేవలం నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఉండాలి. ఆ జోన్లలో నుంచి ప్రజలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.

* కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి అన్ని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు, భౌతికదూరం తప్పనిసరి చేస్తున్నట్లు నూతన మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది.

* అంతరాష్ట్ర రవాణాపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే ఇరు రాష్ట్రాల ఒప్పందంతోనే ప్రయాణాలు కొనసాగించాలని తెలిపింది.

* బయట బఫర్ జోన్లపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకోవచ్చు. బఫర్ జోన్లలో జిల్లా అధికారులు షరతులు విధించొచ్చు.

Tags :
|
|
|

Advertisement