Advertisement

  • దుబ్బాక ఉప ఎన్నికను పరిశీలించేందుకు స్పెషల్ అధికారి నియామకం..

దుబ్బాక ఉప ఎన్నికను పరిశీలించేందుకు స్పెషల్ అధికారి నియామకం..

By: Sankar Wed, 28 Oct 2020 5:14 PM

దుబ్బాక ఉప ఎన్నికను పరిశీలించేందుకు స్పెషల్ అధికారి నియామకం..


దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పరిశీలకుడిగా తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య నోట్ల కట్టల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపింది.

ఇరుపార్టీలు ఆరోపణలు-ప్రత్యారోపణలతో ఎన్నికల ప్రచార వాతావరణం వేడెక్కింది. మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిని సీఈసీ నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం వ్యవహారాన్ని స్పెషల్ ఆఫీసర్ సమీక్ష చేయనున్నారు.

ఇక దుబ్బాక అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. అనారోగ్య కారణంగా సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత్, కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్ రావు పోటీలో నిలిచారు.

Tags :
|

Advertisement