Advertisement

  • నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు ...కరోనా సెకండ్ వేవ్ పై హెచ్చరించిన సీసీఎంబీ డైరెక్టర్

నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు ...కరోనా సెకండ్ వేవ్ పై హెచ్చరించిన సీసీఎంబీ డైరెక్టర్

By: Sankar Fri, 06 Nov 2020 06:31 AM

నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు ...కరోనా సెకండ్ వేవ్ పై హెచ్చరించిన సీసీఎంబీ డైరెక్టర్


భారత్ లో కరోనా వ్యాప్తి తీవ్రంగా వుంది. కరోనా వైరస్‌ ప్రభావం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌ మళ్లీ అమలు చేయబడుతోంది.

ఈ సందర్భంగా సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా కీలక విషయాలు వెల్లడించారు. సెకండ్ వేవ్‌కు కారణం, వైరస్‌లో మార్పులు కాదు అని వెల్లడించారు. తక్కువ జాగ్రత్తలు పాటించడమే వేవ్‌‌కి ప్రధాన కారణం అవుతుందని అన్నారు.

నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోందని తెలిపారు. వైరస్ మన చుట్టూనే ఉందని, ఈ విషయం ఎవరూ మర్చిపోవద్దని రాకేశ్ మిశ్రా హెచ్చరించారు. కొన్నిసార్లు సెకండ్ వేవ్‌లు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని సూచించారు.

Tags :
|
|
|

Advertisement