Advertisement

  • విఆర్వో , విఆర్ఏల పూర్తి వివరాలు ఇవ్వండి ..తహసీల్దారులను ఆదేశించిన ప్రభుత్వం

విఆర్వో , విఆర్ఏల పూర్తి వివరాలు ఇవ్వండి ..తహసీల్దారులను ఆదేశించిన ప్రభుత్వం

By: Sankar Fri, 11 Sept 2020 04:35 AM

విఆర్వో , విఆర్ఏల పూర్తి వివరాలు ఇవ్వండి ..తహసీల్దారులను ఆదేశించిన ప్రభుత్వం


విఆర్వో వ్యవస్థను రద్దు చేసి కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం , రద్దయిన విఆర్వోలను వారి అర్హతలకు అనుగుణంగా ఇతర డిపార్ట్మెంట్ లలోకి తీసుకునే ప్రక్రియను మొదలుపెట్టింది..

రాష్ట్రంలోని వీఆర్‌ఏ, వీఆర్వోల పూర్తి వివరాలు అందించాలని తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేసింది సీసీఎల్‌ఏ.. ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు...? సస్పెన్షన్‌లో ఉన్న వారెంత మంది...? విధుల్లో ఉన్నవారు ఎంత మంది...? అసలు పోస్టులెన్ని? ఖాళీలు ఎన్ని...? ఉద్యోగుల వారీగా వివరాలు సేకరించాలని తహశీల్దార్లను ఆదేశించింది సీసీఎల్‌ఏ..

కాగా కొత్త రెవెన్యూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా.. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసే బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అయితే, ఇదే సమయంలో వీఆర్వోలు ఎవరూ ఉద్యోగం పోతుందేమోనని భయపడవద్దని సీఎం కేసీఆర్ అభయమిచ్చారు. వీఆర్వో వ్యవస్థ ఉండాలా వద్దా అనే విషయంపై ప్రజలు మరియు ప్రజాప్రతినిధులతో చర్చించామని ఆయన తెలిపారు. వీఆర్ఏ, వీఏవోలను వారి అర్హతను బట్టి ఇరిగేషన్, పంచాయతీ రాజ్ డిపార్ట్‌మెంట్లలో సర్దుబాటు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం. దీంతో.. వారి వివరాలను సేకరించాలని ఆదేశాలు వెళ్లాయి

Tags :
|
|
|
|

Advertisement