Advertisement

మరోసారి డీకే శివ కుమార్ ఇంట్లో సోదాలు...

By: Sankar Mon, 05 Oct 2020 11:37 AM

మరోసారి డీకే శివ కుమార్ ఇంట్లో సోదాలు...


కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను టార్గెట్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.. మనీ లాండరింగ్ కేసులో గతంలో డీకే శివకుమార్ ను అరెస్టు చేసింది ఈడీ.. పలుమార్లు సోదాలు, విచారణ తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు.. అయితే, ఇప్పుడు డీకే శివకుమార్ ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేశారు.. డీకే శివకుమార్ ఇల్లు, ఆఫీసులో ఏకకాలంలో సోదాలు కొనసాగుతుండగా.. ఇదే సమయంలో.. ఆయన సోదరుడు డీకే సురేష్ ఇల్లు సహా 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు సీబీఐ అధికారులు...

మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా కేసు నమోదు చేసిన సీబీఐ.. కర్ణాటకలోని తొమ్మిది, ఢిల్లీలోని నాలుగు, ముంబైలో సహా మొత్తంగా 14 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తోంది. కాగా, గత ఏడాది 58 ఏళ్ల డీకే శివకుమార్‌ను నాలుగు రోజుల పాటు ప్రశ్నించిన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన సంగతితెలిసిందే. 2017లో శివకుమార్ పై ఐటీ దాడులు జరిగాయి, బహిర్గతం చేయని ఆదాయంలో రూ. 8.6 కోట్ల ఆస్తులను గుర్తించాయి. ఆ తర్వాత ఈ సంఖ్య రూ.11 కోట్లుగా సవరించారు. ఇక, ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 2018లో శివకుమార్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

మరోవైపు.. సీబీఐ దాడుల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.. బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే శివకుమార్‌పై సీబీఐ దాడులు చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ దాడులపై స్పందించిన కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా... మోడీ, యడ్యూరప్ప ప్రభుత్వాలు, బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్‌గా సీబీఐ-ఈడీ-ఆదాయపు పన్నుశాఖలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అలాంటి వంచన ప్రయత్నాలకు తలొగ్గరు అంటూ ట్వీట్ చేశారు

Tags :
|
|

Advertisement