Advertisement

  • సుశాంత్ సింగ్ మృతి పై దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ

సుశాంత్ సింగ్ మృతి పై దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ

By: chandrasekar Fri, 07 Aug 2020 4:10 PM

సుశాంత్ సింగ్  మృతి పై దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఫ్లాట్‌లో మరణించిన విషయం తెలిసిందే. అతని మరణంలో వీడని మిస్టరీని విచారించుటకు సిబిఐ ఎట్టకేలకు రంగంలో దిగింది. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు బాలీవుడు నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును దర్యాప్తునకు స్వీకరించిన కేంద్ర దర్యాప్తు బృందం (CBI) గురువారం ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్య చక్రవర్తి, షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరండ, శృతి మోదీ, మరికొందరు వ్యక్తులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో తొలి ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసిన బిహార్ పోలీసులతో సీబీఐ సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు, సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని త్వరలోనే తమ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనుంది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఫ్లాట్‌లో మరణించిన తరువాత అది ఆత్మహత్య అని ముంబై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ముంబై, పాట్నా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ముంబై పోలీసులు ఇప్పటికే 50 మంది వరకు బాలీవుడ్ ప్రముఖులు, సుశాంత్ స్నేహితులు, కుటుంబ సభ్యులను విచారించారు. మరోవైపు, రియా చక్రవర్తిపై ఆరోపణలు గుప్పిస్తూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కొడుకు మరణానికి రియా, ఆమె కుటుంబమే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇందువల్ల కేసును సీబీఐకి అప్పగించాలని వాదనలు వినిపిస్తున్నాయి. ఆఖరికి రియా చక్రవర్తి సైతం కేసును సీబీఐకి అప్పగించాలని గతంలో సోషల్ మీడియా ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. అలాగే, బిహార్‌కు చెందిన పలువురు రాజకీయ నేతలు కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా సుశాంత్ తండ్రి కేకే సింగ్ అభ్యర్థన మేరకు సీబీఐ విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బిహార్ నుంచి వత్తిడి పెరగడంతో మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. మరోవైపు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. సుశాంత్ ఖాతాలో కోట్ల రూపాయలు మాయమయ్యానని పాట్నా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే రియా చక్రవర్తికి ఈడీ సమన్లు పంపింది. శుక్రవారం రియాను ఈడీ విచారించనుంది. సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి సుమారు రూ.15 కోట్లు మాయమయ్యానని ఈ సొమ్మును రియా చక్రవర్తి కాజేసిందని సుశాంత్ తండ్రి ఆరోపిస్తున్నారు. అసలు అతని మరణానికి ఎవరు కారణమో అని ప్రజలందరూ వేచి చూస్తున్నారు.

Tags :
|
|

Advertisement