Advertisement

  • దర్యాప్తు కొనసాగుతుంది..సుశాంత్ మృతి కేసుపై సీబీఐ క్లారిటీ

దర్యాప్తు కొనసాగుతుంది..సుశాంత్ మృతి కేసుపై సీబీఐ క్లారిటీ

By: Sankar Mon, 28 Sept 2020 4:06 PM

దర్యాప్తు కొనసాగుతుంది..సుశాంత్ మృతి కేసుపై సీబీఐ క్లారిటీ


బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో పెద్ద దుమారమే లేసింది..సుశాంత్ సూసైడ్ కాదు , హత్య అని చాల మంది వాదించారు..దీనితో ఆయ‌న మ‌ర‌ణానికి సంబంధించి ద‌ర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) చేప‌ట్టింది.

సుశాంత్ మ‌ర‌ణం వెనుక వృత్తిప‌ర‌మైన ఇబ్బందులు ఉన్నాయా లేదంటే ఇత‌ర కార‌ణాలు ఉన్నాయా అనే దానిపై ద‌ర్యాప్తును నిర్వ‌హిస్తుంది. అయితే కొద్ది రోజులుగా సుశాంత్ కేసు విష‌యం క‌న్నా డ్ర‌గ్స్ కు సంబంధించిన అంశాన్నే ఎక్కువ‌గా హైలైట్ చేస్తున్నారు. దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి..

సుశాంత్ కేసుని ప‌క్క‌న ప‌డేసి డ్ర‌గ్స్ అంశంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారా అంటూ సుశాంత్ అభిమానులు మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో స్పందించిన సీబీఐ.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణానికి సంబంధించి వృత్తిపరమైన దర్యాప్తుతో పాటు అన్ని అంశాలను పరిశీలిస్తున్నాం. ఈ రోజు వరకు ఏ అంశాన్ని తోసిపుచ్చలేదు. ప్ర‌స్తుతం దర్యాప్తు కొనసాగుతోంది అని సీబీఐ క్లారిటీ ఇచ్చింది.

కాగా, 34 ఏళ్ల సుశాంత్ ఈ ఏడాది జూన్ 14న ముంబైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన మృతి చెందిన తీరుపై అనుమానాలు వ్యక్తం కావడంతో తొలుత ముంబై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే కొద్ది రోజులకే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుశాంత్ కేసులో సీబీఐతో పాటు.. డ్రగ్స్, మనీ ల్యాండరింగ్ కోణాలపై ఎన్‌సీబీ, ఈడీలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి

Tags :
|
|

Advertisement