Advertisement

  • న్యాయమూర్తులపై అభ్యంతరకరమైన కామెంట్లు చేసిన 17 మందిపై సిబిఐ కేసు నమోదు

న్యాయమూర్తులపై అభ్యంతరకరమైన కామెంట్లు చేసిన 17 మందిపై సిబిఐ కేసు నమోదు

By: Sankar Tue, 17 Nov 2020 06:25 AM

న్యాయమూర్తులపై అభ్యంతరకరమైన కామెంట్లు చేసిన 17 మందిపై సిబిఐ కేసు నమోదు


ఏపీ హైకోర్టు న్యాయమూర్తులనుద్దేశించి సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కామెంట్లు చేసిన వారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ విషయంలో గతంలో సీఐడీ నమోదు చేసిన కేసులను పరిశీలించిన సీబీఐ.. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగింది.

గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు 17మందిపై సీఐడీ కేసులు నమోదు చేయగా వారిపైనే ఇపుడు సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. అయితే, గతంలో సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఆ తర్వాతనే ఈ విషయంలో దర్యాప్తు చేయాలని సీబీఐని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. 12 కేసులను విశాఖలో రిజిస్టర్ చేశారు. ప్రస్తుతం సీబీఐ ఇన్వెస్టిగేటింగ్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీబీఐ బృందం పదిహేడు మందిపై కేసు నమోదు చేయగా వారిలో ముగ్గురు విదేశీయులున్నారు.ఈ 17 మందిపై సోషల్ మీడియా, మీడియాలోను న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను అభియోగాలను నమోదు చేశారు.

Tags :
|
|

Advertisement