Advertisement

  • కరోనా వాక్సిన్ కు పేటెంట్ పొందిన మొట్టమొదటి సంస్థ క్యాన్సినో

కరోనా వాక్సిన్ కు పేటెంట్ పొందిన మొట్టమొదటి సంస్థ క్యాన్సినో

By: chandrasekar Tue, 18 Aug 2020 10:56 AM

కరోనా వాక్సిన్ కు పేటెంట్ పొందిన మొట్టమొదటి సంస్థ క్యాన్సినో


ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనాకు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసే దిశలో చైనా ముందుకు వెళ్తోంది. చైనాకు చెందిన క్యాన్ సినో బయోలాజిక్స్, బీజింగ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ కలిసి అభివృద్ధి చేసిన ‘క్యాన్ సినో’ వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్ లోనూ మంచి ఫలితాలు వచ్చాయి

ఈ కరోనా టీకా Ad5-nCOV కు గానూ చైనా పేటెంట్ హక్కులు పొందింది. ఆ దేశానికి చెందిన ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ రెగ్యులేటర్ దగ్గర లభ్యమైన పేపర్ల ఆధారంగా అక్కడి మీడియా ఈ వివరాలను పేర్కొంది.

కరోనా వాక్సిన్ కు పేటెంట్ పొందిన మొట్టమొదటి సంస్థ క్యాన్ సినో అని, బీజింగ్ ఆ హక్కులను ఆగస్టు 11నే జారీ చేసిందని చెప్పింది. ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఈ నెలలో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ట్రయల్స్ కోసం పలు దేశాలతో చైనా చర్చలు జరుపుతోంది.

మరోవైపు, ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ ను ఆగస్టు 12న ప్రకటించిన రష్యా తొలి బ్యాచ్ ఉత్పత్తి కూడా పూర్తిచేసినట్టు తెలిపింది. వ్యాక్సిన్ ఉత్పత్తికి పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని, ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్టు పేర్కొంది.

అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వ్యాక్సిన్ ప్రయోగాలలో రష్యా పేరు లేకపోవడం గమనార్హం. తమ దేశానికి చెందిన వందలాది మంది వైరాజిస్టులతో పాటు ఇమ్యునాలజిస్టులు, బయో టెక్నాజిస్టులు గత 20 ఏళ్లుగా చేసిన పరిశోధనల ఫలితంగానే కారొన వాక్సిన్ తమకింత త్వరగా సాధ్యమైందని రష్యా అంటోంది.

Tags :
|
|

Advertisement