Advertisement

  • హాట్‌స్పాట్లుగా మారిన‌ కొన్ని న‌గ‌రాల్లో మాత్రం కేసులు అధికం: ఎయిమ్స్ డైర‌క్ట‌ర్

హాట్‌స్పాట్లుగా మారిన‌ కొన్ని న‌గ‌రాల్లో మాత్రం కేసులు అధికం: ఎయిమ్స్ డైర‌క్ట‌ర్

By: chandrasekar Tue, 21 July 2020 12:07 PM

హాట్‌స్పాట్లుగా మారిన‌ కొన్ని న‌గ‌రాల్లో మాత్రం కేసులు అధికం: ఎయిమ్స్ డైర‌క్ట‌ర్


ఎయిమ్స్ డైర‌క్ట‌ర్ ర‌ణ్‌దీప్ గులేరియా దేశంలో క‌రోనా వైర‌స్ కేసుల‌ స‌మూహ వ్యాప్తికి సంబంధించిన ఆధారాలు లేవ‌ని తెలిపారు. హాట్‌స్పాట్లుగా మారిన‌ కొన్ని న‌గ‌రాల్లో మాత్రం కేసులు అధికంగా ఉన్న‌ట్లు చెప్పారు.

అయితే ఆయా ప్ర‌దేశాల్లో మాత్రం స్థానిక స్థాయిలో క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. మీడియాతో ఇవాళ ర‌ణ్‌దీప్ మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో వైర‌స్ కేసులు తారాస్థాయికి చేరినట్లు చెప్పారు.

ఢిల్లీలో వైర‌స్ కేసుల సంఖ్య అత్య‌ధిక స్థాయికి చేరి ఇప్పుడు త‌గ్గుముఖం ప‌డుతున్న‌ట్లు తెలిపారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వైర‌స్ గ‌రిష్ట స్థాయికి చేరాల్సి ఉంద‌న్నారు. కొన్ని రాష్ట్రాల్లో వైర‌స్ కేసులు పెరుగుతున్న‌ట్లు చెప్పారు. ఆ రాష్ట్రాలు మరికొంత స‌మ‌యంలో గ‌రిష్ట స్థాయికి చేర‌నున్న‌ట్లు తెలిపారు. అమెరికా, ఇట‌లీ, స్పెయిన్‌తో పోలిస్తే ద‌క్షిణ తూర్పు ఆసియా దేశాల్లో వైర‌స్ మ‌ర‌ణాలు త‌క్కువ సంఖ్య‌లో ఉన్న‌ట్లు ఎయిమ్స్ డైర‌క్ట‌ర్ వెల్ల‌డించారు.

18 నుంచి 55 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న వారిపై మాత్ర‌మే మొద‌టి ద‌శ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతాయ‌ని ఎయిమ్స్ డైర‌క్ట‌ర్ వెల్ల‌డించారు. 1125 శ్యాంపిళ్ల‌ను సేక‌రించామ‌ని, దాంట్లో 375 మందికి తొలి ద‌శ‌లో ప‌రీక్షిస్తామ‌న్నారు. 12 నుంచి 65 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న 750 మందికి రెండ‌వ ద‌శ‌లో ప‌రీక్షించ‌నున్న‌ట్లు ర‌ణ్‌దీప్ తెలిపారు.

Tags :
|
|
|

Advertisement