Advertisement

బీజేపీ ఎంపీ మేన‌కా గాంధీపై కేసు

By: chandrasekar Sat, 06 June 2020 12:21 PM

బీజేపీ ఎంపీ మేన‌కా గాంధీపై కేసు

కేర‌‌ళ రాష్ట్రం లో చోటు చేసుకున్న ఏనుగు హ‌త్యోదంతం‌ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశం బీజేపీ సీనియర్‌ నాయకురాలు మేనకా గాంధీపై కేసు న‌మోదుకు కార‌ణ‌మైంది. మ‌ల‌ప్పురం జిల్లాలోని ఓ పోలీస్ స్టేష‌న్‌లో పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేశారు.మలప్పురం జిల్లాను, జిల్లా ప్రజలను కించపరిచే విధంగా మేన‌కా గాంధీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ ఆ జిల్లాకు చెందిన సుభాష్‌ చంద్రన్‌ అనే న్యాయ‌వాది‌ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేనకా గాంధీతో పాటు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టిన పలువురిపై ఫిర్యాదు చేశారు.

మే 29న వెలుగులోకి వచ్చిన ఏనుగు ఘటన పాలక్కడ్‌ జిల్లాలో చోటు చేసుకుందని మలప్పురం జిల్లాలో కాదని లాయర్ సుభాశ్ చంద్రన్ తెలిపారు. ఈ ఘటనకు కొంతమంది మతం రంగు పులుముతున్నారని ఆయన ఆరోపించారు.

case,against,bjp,mp,mena,ka gandhi ,బీజేపీ, ఎంపీ, మేన‌కా గాంధీపై, కేసు

ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉన్న మలప్పురం జిల్లాపై సోషల్‌ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ మలప్పురం జిల్లాపై, జిల్లా వాసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా వాసుల‌ను హంత‌కులుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ఏనుగు మృతి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు శుక్రవారం ఒకరిని అరెస్ట్ చేశారు. త్వరలోనే మిగతా నిందితులను అరెస్ట్ చేస్తామని కేరళ అటవీ శాఖ మంత్రి తెలిపారు. అరెస్టు చేసిన వ్యక్తి స్థానికంగా పేలుడు పదార్థాలను అమ్ముతాడని పోలీసులు గుర్తించారు.

క్రూర జంతువుల నుంచి పంటలను రక్షించుకునేందుకు స్థానికులు టపాసులు, పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే అవే పేలుడు పదార్థాలతో గర్భిణి ఏనుగు మృతికి కారణమైన తీరుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏనుగు మృతి ఘ‌ట‌న‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని కేర‌ళ సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ ఆదేశించారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని ఇప్పటికే ముగ్గురు అనుమానితులను గుర్తించామని ఆయన గురువారం వెల్లడించారు.

Tags :
|
|
|
|

Advertisement