Advertisement

  • వాగులో కొట్టుకుపోయిన కారు.. తాటి చెట్టు పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తులు

వాగులో కొట్టుకుపోయిన కారు.. తాటి చెట్టు పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తులు

By: Sankar Wed, 14 Oct 2020 07:58 AM

వాగులో కొట్టుకుపోయిన కారు.. తాటి చెట్టు పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తులు


జనగామ మండలం వడ్లకొండ వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. నర్మెట నుంచి జనగామ వైపు వస్తున్న కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో మంగళవారం రాత్రి సుమారు 10.20 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిలిపివేసి పోలీసులు కాపలాగా ఉన్నారు. ఆ రహదారిపై వస్తున్న కారును ముందు రావొద్దని పోలీసులు వారించినా డ్రైవర్‌ వినిపించుకోకుండా దూసుకొచ్చాడు. కల్వర్టుపైకి రాగానే వరద ఉధృతికి కారు చీటకోడూరు రిజర్వాయర్‌ వైపు కొట్టుకుపోయింది.

ఈ సమయంలో కారులో ఉన్న ఓ వ్యక్తి తాటిచెట్టును గట్టిగా పట్టుకోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వెంటనే మిగతా ఇద్దరు కూడా చెట్టును పట్టుకున్నారు. భారీక్రేన్‌ తెప్పించి ఈ ముగ్గురి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

Tags :
|
|

Advertisement