Advertisement

  • లక్షలు పెట్టి కొన్న కారు...పార్కింగ్ ఫెయిల్ వీడియో వైరల్...

లక్షలు పెట్టి కొన్న కారు...పార్కింగ్ ఫెయిల్ వీడియో వైరల్...

By: chandrasekar Mon, 23 Nov 2020 7:07 PM

లక్షలు పెట్టి కొన్న కారు...పార్కింగ్ ఫెయిల్ వీడియో వైరల్...


లక్షలు పెట్టి కొన్న కారుకు పార్కింగ్ స్థలం సరిగ్గా లేకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో చెప్పే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. పార్కింగ్ ప్రదేశం సరిగ్గా లేక, డ్రైవర్ కారును పార్కింగ్ చేయలేక విఫలమైన సంఘటన సీసీ కెమెరాల్లోని నిక్షిప్తమైంది. విలువైన పోర్స్చే టేకాన్ కారు డ్రైవర్ బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను తొక్కాడు. దీంతో ఆ లగ్జరీ కారు మరో రెండు వాహనాలను ఢీకొట్టింది. బ్రిటన్‌లోని ఎసెక్స్ లో మన్నింగ్ ట్రీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. చిన్నపాటి గుట్టపై నిర్మించిన ఇంటి ముందు, వాలుగా ఉన్న రోడ్డుపై పోర్స్చే కారును డ్రైవర్ పార్కింగ్ చేయాలనుకున్నాడు. కానీ ఊహించని విధంగా కారు కుడి వైపుకు తిరిగి, రోడ్డుపైన పడింది. ఈ క్రమంలో నలుపు రంగులో ఉన్న ఎస్‌యూవీని, రోడ్డుపై ఆపి ఉంచిన మరొక కారుని ఢీకొట్టింది. దీంతో ఆ రెండు వాహనాలూ దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడకుండా తప్పించుకోగలిగాడని స్థానిక వార్తాసంస్థలు పేర్కొన్నాయి. ప్రమాదం జరగడానికి ఐదు రోజుల ముందే ఆ వ్యక్తి పోర్స్చే టేకాన్‌ను కొనుగోలు చేశాడట. ఈ లగ్జరీ కారు విలువ 83,000 పౌండ్ల వరకు (రూ.81 లక్షలు) ఉంటుందని అంచనా.

ఈ వీడియోను ముందు యూట్యూబ్‌లో, ఆ తరువాత ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో అప్‌లోడ్ చేశారు. ట్విట్టర్లో దీన్ని 4.3 మిలియన్ల మంది చూశారు. ప్రమాదంపై చాలామంది వ్యగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. "ఇది సెల్ఫ్ డిస్ట్రక్ట్ బటన్‌తో వచ్చిందని ఎవరికి తెలుసు" అని ఒక ట్విట్టర్ యూజర్ రాశాడు. "ఎపిక్ ఫెయిల్" అని మరొక వ్యక్తి ట్వీట్ చేశాడు. కారు డ్రైవర్ బ్రేక్‌లకు బదులుగా యాక్సిలరేటర్‌ను తొక్కడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని చాలామంది ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు.

Tags :
|

Advertisement