Advertisement

  • Breaking: బండారు దత్తాత్రేయకు ప్రమాదం... హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా..!

Breaking: బండారు దత్తాత్రేయకు ప్రమాదం... హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా..!

By: Anji Mon, 14 Dec 2020 2:55 PM

Breaking: బండారు దత్తాత్రేయకు ప్రమాదం... హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా..!

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద అదుపుతప్పి వాహనం పక్కకు దూసుకెళ్లింది.

ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయ, డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు ఉన్నారు. ఈ ఘటన నుంచి ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.

హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మరో వాహనంలో దత్తాత్రేయ సూర్యాపేటకు బయలుదేరారు. ఒక్క సారిగా ఈ వార్త విని రాజకీయ నాయకులు, అభిమానులు ఉలిక్కి పడ్డారు.

Tags :

Advertisement