Advertisement

  • ప్యారిస్‌లో నిర్వహించాల్సిన మారథాన్‌ కరోనా కారణంగా రద్దు

ప్యారిస్‌లో నిర్వహించాల్సిన మారథాన్‌ కరోనా కారణంగా రద్దు

By: chandrasekar Thu, 13 Aug 2020 5:41 PM

ప్యారిస్‌లో నిర్వహించాల్సిన మారథాన్‌ కరోనా కారణంగా రద్దు


ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేయడంతో అనేక పోటీలు రాదు చేయబడ్డాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ప్యారిస్‌లో నిర్వహించాల్సిన మారథాన్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. మారథాన్‌ నిర్వహణకు పలుసార్లు నిర్వహించాలని కొత్త తేదీలు నిర్ణయించినా చివరకు రద్దు చేస్తున్నట్లు ది అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపింది. మారథాన్‌ వాస్తవానికి ఏప్రిల్‌లో నిర్వహించాల్సి ఉంది. కొవిడ్‌-19 వైరస్‌ కారణంగా అక్టోబర్‌కు వాయిదా వేశారు.

కరోనా కు వాక్సిన్ ఇంతవరకు రాక పోవడంతో వేరే మార్గం లేక కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో నవంబర్‌లో నిర్వహించేందుకు రేసును రీ షెడ్యూల్ చేయడానికి నిర్వాహకులు ప్రయత్నించారని తెలిపింది. ఆంక్షల నేపథ్యంలో ప్రయాణం కొనసాగించడం సాధ్యం కాదని, చాలా మంది రన్నర్లు, ముఖ్యంగా విదేశాల నుంచి వస్తారని పేర్కొంది. అనేక దేశాలలో విమాన ప్రయాణాలు రద్దు కావడం, వస్తే క్వారంటైన్ లో ఉండాల్సి రావడం ఇలా అనేక కారణాలవల్ల ఆలస్యమవడంతో బాటు నిర్వహణ ఏర్పాట్లు చెయ్యలేక రద్దు చెయ్యబడింది.

వచ్చే ఏడాది 2021లో మారథాన్ ఏర్పాటు చేస్తే రన్నర్లకు మరింత మెరుగ్గా, సరళంగా ఉంటుందని నిర్ణయించారు. ఇకపై వచ్చే ఏడాది నిర్వహించే మారథాన్‌పై దృష్టి పెడుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది రేసులో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న రన్నర్లు వచ్చే ఏడాదికి ఆటోమెటిక్‌గా ఎంపిక లిస్టులో చేర్చబడతారని చెప్పారు.

Tags :
|
|
|

Advertisement