Advertisement

  • రష్యా కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కెనడా ..

రష్యా కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కెనడా ..

By: Sankar Wed, 12 Aug 2020 11:05 AM

రష్యా కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కెనడా ..



కరోనా మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచ దేశాలకు రష్యా కరోనా వాక్సిన్ విషయంలో గుడ్ న్యూస్ చెపింది ..రష్యా అధ్యక్షుడు పుతిన్ వాక్సిన్ విషయంలో ప్రకటన చేసాడు ..అయితే కెనడాలో రష్యన్ కరోనావైరస్ వ్యాక్సిన్ ఆమోదించబడదని డిప్యూటీ చీఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ హోవార్డ్ న్జూ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యాక్సిన్‌కు సబంధించి తగిన సమాచారం లేనందున తాము ఆమోదించమని ఆయన స్పష్టం చేశారు.

కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టిన మొట్టమొదటి దేశం రష్యా అని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే న్జూ మాట్లాడుతూ రష్యాలో ఇంత త్వరగా టీకా ఆమోదం పొందడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. కెనడా చీఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ థెరిసా టామ్ మాట్లాడుతూ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే పరిణామాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయని, విదేశాల్లో ఉన్న ఇతర శాస్త్రవేత్తలతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా రాబోయే 12 నెలల్లో దేశం 500 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను రష్యా ఉత్పత్తి చేయగలదని, విదేశాల్లో కూడా ఉత్పత్తి నిర్వహించబడుతుందని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్‌లో క్లినికల్ ట్రయల్స్ త్వరలో ప్రారంభమవుతాయని రష్యా అధికారులు తెలిపారు.

Tags :
|
|
|

Advertisement