Advertisement

  • రైతుల నిరసనపై ఆందోళన వ్యక్తం చేసిన కెనడా ప్రధాని

రైతుల నిరసనపై ఆందోళన వ్యక్తం చేసిన కెనడా ప్రధాని

By: Sankar Tue, 01 Dec 2020 10:40 PM

రైతుల నిరసనపై ఆందోళన వ్యక్తం చేసిన కెనడా ప్రధాని


కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ దేశ రాజ‌ధానిలో పంజాబ్ రైతులు తెలుపుతున్న నిర‌స‌న‌ల‌పై కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇదే విష‌యాన్ని తాము భార‌త ప్ర‌భుత్వానికి తెలియ‌జేస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

సోమ‌వారం గురునాన‌క్ 551వ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న కెన‌డా ఎంపీ బ‌ర్దీష్ చ‌గ్గ‌ర్ ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్ వీడియో ఇంట‌రాక్ష‌న్‌లో మాట్లాడారు. ఆయ‌న‌తోపాటు మంత్రులు న‌వ్‌దీప్ బైన్స్‌, హ‌ర్జిత్ స‌జ్జ‌న్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇండియాలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆందోళ‌న క‌లిగించేలా ఉన్నాయి. ఆ వార్త‌ల గురించి తెలిసి కూడా నేను మాట్లాడ‌కుండా ఉండ‌లేను.

అక్క‌డ త‌మ కుటుంబం, స్నేహితులు ఎలా ఉన్నారో అన్న ఆందోళ‌న ఇక్క‌డి వాళ్ల‌లో ఉంది. శాంతియుత నిర‌స‌న‌ల‌కు కెన‌డా ఎప్పుడూ మ‌ద్ద‌తు తెలుపుతుంద‌ని నేను మీకు చెప్ప‌ద‌ల‌చుకున్నాను. చ‌ర్చ‌ల ద్వారానే స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయి. ఈ అంశంపై మా ఆందోళ‌న వ్య‌క్తం చేయడానికి భార‌త అధికారుల‌తో సంప్ర‌దిస్తున్నాం అని ట్రూడో వెల్ల‌డించారు

Tags :

Advertisement