Advertisement

  • పాత చట్టాలతో కొత్త శతాబ్ధాన్ని నిర్మించలేము ...రైతుల భారత్ బంద్ పై మోడీ వ్యాఖ్యలు

పాత చట్టాలతో కొత్త శతాబ్ధాన్ని నిర్మించలేము ...రైతుల భారత్ బంద్ పై మోడీ వ్యాఖ్యలు

By: Sankar Mon, 07 Dec 2020 8:37 PM

పాత చట్టాలతో కొత్త  శతాబ్ధాన్ని నిర్మించలేము ...రైతుల భారత్ బంద్ పై మోడీ వ్యాఖ్యలు


కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఢిల్లీలో రైతులు గత కొద్దీ రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే..అయితే ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు రేపు దేశం మొత్తం బంద్ కు పిలుపునిచ్చాయి...అయితే ఈ బంద్ కు బీజేపీ యేతర పాలిత రాష్ట్రాలు అన్ని మద్దతు ప్రకటించాయి...అయితే ఈ బంద్ పై పీఎం నరేంద్ర మోడీ స్పందించారు...

పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని నిర్మించలేమని వ్యాఖ్యానించారు. అభివృద్ధి జరగాలంటే సంస్కరణలు ఎంతో అవసరమన్న ఆయన.. శతాబ్దాల కింద చేసిన చట్టాలు ప్రస్తుతం భారంగా మారాయని పేర్కొన్నారు. కేంద్ర సర్కార్ తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేయడంతో.. భారత్‌ బంద్‌ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

దేశం అభివృద్ధి చెందాలంటే సంస్కరణలు అత్యావశ్యకం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. నూతన సౌకర్యాలు కల్పించాలన్నా, కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా... సంస్కరణలు అవసరమన్న ఆయన.. గత శతాబ్దపు చట్టాలతో నూతన శతాబ్దాన్ని నిర్మించలేం అని వ్యాఖ్యానించారు. సంస్కరణలనేవి నిరంతరాయంగా జరిగే ప్రక్రియ... గత శతాబ్దంలో కొన్ని చట్టాలు ఉపయోగంలో ఉండేవి.. కానీ, ఈ శతాబ్దానికి అవి భారంగా మారాయని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక, గతంలో సంస్కరణలు కొన్ని రంగాలకే పరిమితం అయ్యావి.. కానీ, తమ సర్కార్‌ మాత్రం అన్ని రంగాల్లో సంస్కరణలను విస్తరించినట్టు చెప్పుకొచ్చారు భారత ప్రధాని.

Tags :
|

Advertisement