Advertisement

  • ల్యాండ్ లైన్ నుండి మొబైల్ నెంబర్‌కు ఫోన్ చేస్తున్నారా...

ల్యాండ్ లైన్ నుండి మొబైల్ నెంబర్‌కు ఫోన్ చేస్తున్నారా...

By: chandrasekar Wed, 25 Nov 2020 9:01 PM

ల్యాండ్ లైన్ నుండి మొబైల్ నెంబర్‌కు ఫోన్ చేస్తున్నారా...


ల్యాండ్ లైన్ నుండి మొబైల్ నెంబర్‌కు ఫోన్ చేస్తున్నారా? అయితే జనవరి 1, 2021 నుండి ఫోన్ నెంబర్ డయల్ చేయడానికి ముందు సున్నాను కలపవలసి ఉంటుంది. వచ్చే ఏడాది నుండి ఈ మేరకు సౌకర్యం అందుబాటులోకి తీసుకు రావాలని టెలికం డిపార్టుమెంట్ టెల్కోలకు సూచనలు జారీచేసింది. ఈ కొత్త విధానంలోకి మారాలని పేర్కొంది. టెలికం డిపార్టుమెంట్ ఈ మేరకు ఈ విధానానికి పచ్చజెండా ఊపింది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్(టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) సిఫార్సుకు టెలికం డిపార్టుమెంట్ ఆమోదం తెలిపింది. జనవరి 1వ తేదీ నుడి మొబైల్స్‌కు కాల్స్ చేసేటప్పుడు సున్నాను జత చేయాలని ట్రాయ్ చేసిన సూచనకు ఒకే చెప్పింది. టెలికం సంస్థలు కూడా ఈ కొత్త విధానంలో నెంబర్లు జారీ చేసేందుకు వీలవ్వడంతో అంగీకారం తెలిపాయి.

ల్యాండ్ లైన్ ఫోన్ల నుండి సెల్యూలార్ మొబైల్ నెంబర్ల డయలింగ్ ప్యాట్రన్‌లో మార్పులు చేయాలని, మొబైల్ నెంబర్ల ముందు సున్నాను జోడించి డయల్ చేయాలని, ఇందుకు అవసరమైన టెక్నాలజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావాలని నవంబర్ 20వ తేదీన ట్రాయ్ ఉత్తర్వులు జారీ చేసింది. ల్యాండ్ లైన్ కస్టమర్లకు సున్నా డయలింగ్ సౌకర్యం కల్పించాలని పేర్కొంది. దీంతో ఇప్పుడు ఉన్న పది అంకెలకు ముందు సున్నాను జత చేయాలి.

డయలింగ్ ప్యాట్రన్ మార్చడం వల్ల భవిష్యత్తు అవసరాల కోసం 2544 మిలియన్ల నెంబర్లు అదనంగా లభించనున్నాయి. ట్రాయ్ మే 29, 2020న సిఫార్సు చేయగా, డిపార్టుమెంటు దీనికి ఓకే చెప్పింది. అయితే ముందు జీరో యాడ్ చేయడం నేపథ్యంలో ఫోన్ నెంబర్ల అంకెలను పెంచడం కాదని తెలిపింది.

Tags :
|

Advertisement