Advertisement

  • దీపావ‌ళి అమ్మ‌కాలపై సీఏఐటీ నివేదిక... 72 వేల కోట్ల ఖరీదైన అమ్మ‌కాలు.. చైనాకు భారీ న‌ష్టం

దీపావ‌ళి అమ్మ‌కాలపై సీఏఐటీ నివేదిక... 72 వేల కోట్ల ఖరీదైన అమ్మ‌కాలు.. చైనాకు భారీ న‌ష్టం

By: chandrasekar Mon, 16 Nov 2020 4:43 PM

దీపావ‌ళి అమ్మ‌కాలపై సీఏఐటీ నివేదిక... 72 వేల కోట్ల ఖరీదైన అమ్మ‌కాలు.. చైనాకు భారీ న‌ష్టం


దేశ‌వ్యాప్తంగా ఈ యేడాది దీపావ‌ళి వేళ జ‌రిగిన అమ్మ‌కాల‌పై కాన్ఫిడరేష‌న్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడ‌ర్స్ (సీఏఐటీ) త‌న నివేదిక‌ను రిలీజ్ చేసింది. దేశంలోని అతి ప్ర‌ధాన‌మైన మార్కెట్ల‌లో సుమారు 72 వేల కోట్ల ఖరీదైన అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్లు ఆదివారం సీఏఐటీ పేర్కొంది. అయితే ఈసారి చైనా ఉత్ప‌త్తుల‌కు భారీ న‌ష్టం జ‌రిగినట్లు ఆ ట్రేడ‌ర్స్ సంఘం ప్రకటించింది. భార‌తీయ వ్యాపారులు చైనా ఉత్ప‌త్తుల‌పై నిషేధం విధించ‌డం వ‌ల్ల సుమారు 40 వేల కోట్ల చైనా వ‌స్తువుల అమ్మ‌కాలు జ‌ర‌గ‌లేద‌ని సీఏఐటీ పేర్కొన్న‌ది.

ఈస్ట్ర‌న్ ల‌డాఖ్‌లోని వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద చైనా, భార‌త్ మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న నేప‌థ్యంలో.. చైనా ఉత్ప‌త్తుల‌ను ఖ‌రీదు చేయ‌రాదు అని సీఏఐటీ నిషేధం విధించింది. అయితే దేశంలోని 20 ప్ర‌ధాన న‌గ‌రాల్లో సుమారు 72 వేల కోట్ల దీపావ‌ళి వ్యాపారం జ‌రిగిన‌ట్లు సీఏఐటీ పేర్కొంది. చైనాకు మాత్రం 40 వేల కోట్ల న‌ష్టం వ‌చ్చిన‌ట్లు త‌న ప్ర‌క‌ట‌న‌లో సీఏఐటీ తెలిపింది.

దీపావ‌ళి పండుగ వేళ ఎఫ్ఎంసీజీ ఉత్ప‌త్తులు, ఎల‌క్ట్రిక‌ల్ అప్లియ‌న్సెస్‌, కిచెన్ ఆర్టికిల్స్‌ ఎక్కువ‌గా అమ్ముడుపోయాయి. జ్వ‌ల‌రీ, ఫ‌ర్నీచ‌ర్‌, గార్మెంట్స్ మార్కెట్ కూడా బాగానే సాగింది. దివాళీ వ్యాపారం ప‌రిశీలిస్తే, భ‌విష్య‌త్తు మార్కెట్ బాగానే క‌నిపిస్తున్న‌ట్లు సీఏఐటీ తెలిపింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు, హైద‌రాబాద్‌, కోల్‌క‌తా, నాగ‌పూర్‌, రాయ్పూర్‌, భువ‌నేశ్వ‌ర్‌, రాంచీ, భోపాల్‌, ల‌క్నో, కాన్పూర్‌, నోయిడా, జ‌మ్మూ, అహ్మ‌దాబాద్‌, సూర‌త్‌, కొచ్చిన్‌, జైపూర్‌, చండీఘ‌డ్ న‌గ‌రాల్లో జ‌రిగిన వ్యాపారంపై సీఏఐటీ త‌న నివేదిక‌ను త‌యారు చేసింది.

Tags :
|
|

Advertisement