Advertisement

  • నీలం సాహ్నికి కొత్త బాధ్యతలు అప్పగించిన ఏపీ ప్రభుత్వం

నీలం సాహ్నికి కొత్త బాధ్యతలు అప్పగించిన ఏపీ ప్రభుత్వం

By: Sankar Tue, 22 Dec 2020 8:30 PM

నీలం సాహ్నికి కొత్త బాధ్యతలు అప్పగించిన ఏపీ ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్నికి కీలక బాధ్యతలు అప్పగించారు.. ఈ నెల 31వ తేదీన పదవి విరమణ చేయనున్నారు నీలం సాహ్ని... ఇప్పటికే కొత్త సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ను నియమించారు.. ఇక, నీలం సాహ్నికి కేబినెట్‌ ర్యాంక్ ఇచ్చింది ఏపీ సర్కార్.. ఆమెను సీఎం ముఖ్య సలహాదారుగా నియమించారు..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు, విభజన అంశాలు వంటి కీలక బాధ్యతలను నీలం సాహ్నికి అప్పజెప్పింది ప్రభుత్వం. వైద్య ఆరోగ్యం , కోవిడ్‌ మేనేజ్మెంట్‌, గ్రామ సచివాలయాల బలోపేతం వంటి కీలక బాధ్యతలు కూడా నీలం సాహ్నికి అప్పజెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

కాగా, ఎల్వీ సుబ్రమణ్యం తర్వాత ఏపీ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని విషయంలో మొదటి నుంచి సీఎం వైఎస్‌ జగన్ సానుకూలంగా ఉన్నారు. ఆమె పదవీకాలం ముగిసినప్పటికీ.. కేంద్రానికి విజ్ఞప్తి చేసి మరి రెండుసార్లు ఆమె పదవీ కాలాన్ని పొగించేలా చూసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు కీలక పదవి అప్పగించారు.

Tags :
|

Advertisement