Advertisement

  • టీ 20 వరల్డ్ కప్ జరిగే పనికాదని సీఏ చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ కామెంట్స్

టీ 20 వరల్డ్ కప్ జరిగే పనికాదని సీఏ చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ కామెంట్స్

By: chandrasekar Thu, 18 June 2020 11:47 AM

టీ 20 వరల్డ్ కప్ జరిగే పనికాదని సీఏ చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ కామెంట్స్


మెగా టోర్నమెంట్‌‌ను నిర్వహించాల్సిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) దాదాపు చేతులెత్తేసింది. ప్రపంచకప్‌‌ జరిగే పని కాదని సీఏ చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ మంగళవారం చేసిన కామెంట్స్ ఇందుకు బలం చేకూరుస్తున్నాయి . నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియా వేదికగా ఈ మెగా ఈవెంట్‌‌ జరగాల్సి ఉంది.

కరోనా మహమ్మారి దెబ్బకు టోర్నీ జరగడంపై కొన్ని నెలలుగా అనుమానాలు ఉన్నాయి. కానీ టోర్నీ సంగతిని వచ్చే నెలలో తేలుస్తామని ఐసీసీ కొద్ది రోజులు క్రితం ప్రకటించింది. ఈ లోపు కరోనా ప్రభావం తగ్గడంతో స్టేడియంలోకి ఫ్యాన్స్ (25శాతం)ను అనుమతిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని గత వారం ప్రకటించారు. దీంతో వరల్డ్ ‌కప్‌‌కు లైన్ క్లియర్ అయినట్టే అని అంతా భావించారు.

మరో పక్క ప్రపంచకప్‌ ‌విండోలో ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ లీగ్‌‌కు రెడీగా ఉన్నామని స్టేట్ అసోసియేషన్లకు సమాచారం ఇవ్వడంతో మళ్లీ గందరగోళం మొదలైంది.

ca chairman,earl eddings,comments,t20 world cup,will not work ,టీ 20 వరల్డ్ కప్ ,జరిగే, పనికాదని, సీఏ చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ ,కామెంట్స్


వరల్డ్ ‌కప్‌‌, ఐపీఎల్ లో ఏది జరుగుతుందనే సస్పెన్స్ రెట్టింపు అయింది. కానీ సీఏ చైర్మన్ చేసిన ప్రకటనతో కాస్త స్పష్టత వచ్చింది. ‘ టీ20 వరల్డ్ కప్ ఈ ఏడాదికి ఇంకా రద్దుచేయలేదు. అలాగని పోస్ట్ పోన్ చేయలేదు. కానీ చాలా దేశాలు ఇంకా కరోనాపై పోరాడుతున్న ఈ సమయంలో16 జట్లను ఒక చోటుకు చేర్చడమంటే నా దృష్టిలో అది జరిగే పనికాదు. మరోలా చెప్పాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. మేమైతే టోర్నీకి సంబంధించి ఐసీసీ ముందు చాలా ఆప్షన్స్ ఉంచాం. కానీ ఐసీసీ ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది’ అని ఎడింగ్స్ అన్నారు.

అయితే టీ20 వరల్డ్ ‌కప్‌‌పై తుది నిర్ణయాన్ని ఐసీసీనే తీసుకుంటుందని సీఏ తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మంగళవారం బాధ్యతలు చేపట్టిన నిక్ హాక్లే అన్నారు. ఎలాంటి నిర్ణయం వచ్చినా వెంటనే స్పందించి తగిన ఏర్పాట్లు చేయగలదన్నారు. ఏదేమైనా ఎడింగ్స్ కామెంట్స్ ఎలా ఉన్నా ప్రస్తుత పరిస్థితులను చూస్తే మెగా టోర్నీ రద్దు లేదా వాయిదా తప్పదనిపిస్తోంది.

Tags :

Advertisement