Advertisement

  • పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ముగిసాయి...తుది దశ ఎన్నికల ప్రచారంపై దృష్టి

పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ముగిసాయి...తుది దశ ఎన్నికల ప్రచారంపై దృష్టి

By: chandrasekar Wed, 04 Nov 2020 6:54 PM

పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ముగిసాయి...తుది దశ ఎన్నికల ప్రచారంపై దృష్టి


మంగళవారం దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఝార్ఖండ్‌, కర్ణాటక, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల పలు స్థానాలు ఖాళీ కాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆయా స్థానాలకు ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసేంది.

అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా గుజరాత్‌లో ఎనిమిది, యూపీలో ఏడు, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్‌, నాగాలాండ్‌లో రెండు చొప్పున, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, హర్యానాలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి.

సాయంత్రం ఆరుగంటల దాకా పోలింగ్‌ కొనసాగగా ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. నవంబర్‌ 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించారు.

బీహార్‌ శాసనసభకు మూడు విడుతల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ 94 స్థానాలకు రెండో విడుత పోలింగ్‌ కంప్లీట్ అయ్యింది. పలువురు ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలకు ఎన్నికలు ముగియడంతో తుది దశ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు.

Tags :

Advertisement