Advertisement

  • ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక సందడి

ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక సందడి

By: chandrasekar Fri, 31 July 2020 09:31 AM

ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక సందడి


ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక సందడి మొదలుకానుంది. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఖాళీ భర్తీకి షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదలకానుంది. ఆగస్టు 13 నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 24 పోలింగ్ అదేరోజు ఓట్ల లెక్కింపు ఫలితాలు ఉంటాయి.

ఇక పిల్లి సుభాష్ చంద్ర బోస్ రాజీనామాతో ఖాళీగా ఉన్న స్థానానికి పదవీకాలం ఆరు నెలలలోపే ఉండడంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పదవి కోసం వైఎస్సార్‌సీపీలో ఆశావహులు పోటీపడుతున్నారు. జగన్ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎంపిక అయ్యారు.

అందువల్ల ఇద్దరూ తమ మంత్రి పదవులతో పాటూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయగా ఆమోదం తెలిపారు. ఇటీవల వారిద్దరు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి మొత్తం నలుగురు రాజ్యసభకు వెళ్లారు. మోపిదేవి, పిల్లి చంద్రబోస్‌లతో పాటూ అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు ఉన్నారు.

Tags :
|
|

Advertisement