Advertisement

  • అన్నా మీరు రిప్లై ఇచ్చిన ట్వీట్ ను ఫ్రేమ్ కట్టించుకుంటా ...పవన్ కళ్యాణ్ రిప్లై ఇవ్వడంపై స్పదించిన హీరో

అన్నా మీరు రిప్లై ఇచ్చిన ట్వీట్ ను ఫ్రేమ్ కట్టించుకుంటా ...పవన్ కళ్యాణ్ రిప్లై ఇవ్వడంపై స్పదించిన హీరో

By: Sankar Thu, 03 Sept 2020 3:12 PM

అన్నా మీరు రిప్లై ఇచ్చిన ట్వీట్ ను ఫ్రేమ్ కట్టించుకుంటా ...పవన్ కళ్యాణ్ రిప్లై ఇవ్వడంపై స్పదించిన హీరో


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ట్వీట్ల మోత మోగిపోయింది..సాధారణ అభిమానుల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.. అందరికి ధన్యవాదాలు తెలుపుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ లు చాలా మందికి షాక్ ఇస్తున్నాయనే చెప్పాలి.

తనకు బర్త్ డే విషెస్ ఆర్ ఎక్స్100 హీరో కార్తికేయను 'సార్' అని తన పోస్ట్ లో అన్నాడు పవన్. దీనికి నేను మీ లక్షల మంది అభిమానులలో ఒకడిని. మీరు నన్ను సార్ అనడం ఏంటి సార్ అని మరో పోస్ట్ చేసాడు కార్తికేయ. అయితే పవన్ కు పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన వారిలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ కూడా ఉన్నాడు. దానికి పవన్ ధన్యవాదాలు తెలుపుతూ రిప్లై ఇచ్చారు.

అయితే పవన్ రిప్లై పై స్పందిస్తూ.. అన్నా, మీ దగ్గర నుంచి ఈ రిప్లై రావటం , ఫోటో ఫ్రేమ్ కట్టించుకుంటాను, ఎంత సంతోషంగా ఉందొ మాటల్లో చెప్పలేను'' అని మరో పోస్ట్ చేసాడు.

Tags :
|

Advertisement