Advertisement

  • ఆస్ట్రేలియాలో టీమిండియా విజ‌యావ‌కాశాలకు బుమ్రానే కీలకం

ఆస్ట్రేలియాలో టీమిండియా విజ‌యావ‌కాశాలకు బుమ్రానే కీలకం

By: chandrasekar Fri, 20 Nov 2020 11:22 AM

ఆస్ట్రేలియాలో టీమిండియా విజ‌యావ‌కాశాలకు బుమ్రానే కీలకం


ఈ సారి ఆస్ట్రేలియాలో టీమిండియా విజ‌యావ‌కాశాలకు బుమ్రానే కీలకం కానున్నాడు. ఇండియా చివ‌రిసారి 2018-19లో ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించిన‌ప్పుడు 2-1తో చారిత్ర‌క టెస్ట్ సిరీస్ విజ‌యాన్ని అందుకుంది. ఆ విజ‌యంలో టీమిండియా పేస్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా కీల‌క‌పాత్ర పోషించాడు. సిరీస్‌లో మొత్తం 21 వికెట్లు తీసుకొని, ఆసీస్ స్పిన్న‌ర్ నేథ‌న్ ల‌య‌న్‌తో క‌లిసి టాప్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు. ఇప్పుడు మ‌రోసారి ఆస్ట్రేలియా టూర్‌కు టీమిండియా సిద్ధ‌మైంది. ఈసారి కూడా బుమ్రా టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో 27 వికెట్లు ప‌డ‌గొట్టి అత్య‌ధిక వికెట్ల వీరుల జాబితాలో రెండోస్థానంలో నిలిచాడు. మంచి స్వింగ్ లతో బ్యాట్స్ మాన్ ను ఇబ్బంది పెట్టగలడు. మంచి వేగంతో యార్కర్లు కూడా సంధించడం వల్ల త్వరగా వికెట్లను పడగొట్టగలడు.

దీంతో ఈసారి పర్యటనలో ఆస్ట్రేలియాలో టీమిండియా విజ‌యావ‌కాశాలు మ‌రోసారి బుమ్రా ప్ర‌ద‌ర్శ‌న‌పైనే ఆధార‌ప‌డ్డాయ‌ని ఎక్స్‌ప‌ర్ట్స్ అంచ‌నా వేస్తున్నారు. ఆస్ట్రేలియా పేస్ బౌల‌ర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాడు. బుమ్రా యాక్ష‌న్ ప్ర‌త్యేకం. అత‌డు రోజు మొత్తం, సిరీస్ అంతా ఒకేలా పేస్‌ను మెయింటేన్ చేయ‌గ‌ల‌డు. ఇండియాకు అత‌డే కీల‌కం. బంతి కొత్త‌దైనా, పాత‌దైనా అత‌డు వికెట్లు తీయ‌గ‌ల‌డు. బుమ్రాను త్వ‌ర‌గా అల‌సిపోయేలా చేయాలి. అది కూడా తొలి రెండు టెస్టుల్లోనే చేయాలి. అప్పుడే ఆస్ట్రేలియా సిరీస్ గెలవ‌గ‌ల‌దు అని హేజిల్‌వుడ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇండియా పేస్ బౌలింగ్ అటాక్ చాలా మెరుగైంద‌ని అత‌న‌న్నాడు. ఇక ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ యాషెస్‌కు ఏమాత్రం తీసిపోద‌ని కూడా హేజిల్‌వుడ్ అన్నాడు. అభిమానులంతా ఈ సిరీస్ కోసం చాలా ఎదురుచూస్తున్నారు.

Tags :
|

Advertisement