Advertisement

  • ఇండియా - చైనా సంఘర్షణల విషయంలో మా మద్దతు మోడీకే ...మాయావతి

ఇండియా - చైనా సంఘర్షణల విషయంలో మా మద్దతు మోడీకే ...మాయావతి

By: Sankar Mon, 29 June 2020 3:59 PM

ఇండియా - చైనా సంఘర్షణల విషయంలో మా మద్దతు మోడీకే ...మాయావతి



ఇండియా చైనా మధ్య జరుగుతున్న సంఘర్షణల విషయంలో కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ పార్టీలు మోడీ ప్రభుత్వ పనితీరును తీవ్రంగా విమర్శిస్తున్నాయి ..మోడీ ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇండియా చైనా బోర్డర్ లో ఈ ఉద్రిక్తలకు దారి తీసి 20 మంది సైనికుల ప్రాణాలను మనం కోల్పోయామని కాంగ్రెస్ ధ్వజమెత్తింది ..అయితే బహుజన్ సమాజ్ వాది పార్టీ మాత్రం ఇండియా చైనా ఘర్షణల విషయంలో మోడీకే మద్దతుగా ఉంటుంది అని ప్రకటించింది ఆ పార్టీ అధ్యక్షురాలు , ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం మాయావతి..సోమవారంనాడిక్కడ మీడియాతో మాయావతి మాట్లాడుతూ, ఇండో-చైనా సరిహద్దు అంశంపై బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం దేశ ప్రయోజనాలకు మంచిది కాదని హితవు పలికారు. ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.

ఒకవైపు ప్రస్తుత పరిస్థితి నుంచి ప్రయోజనాలు పొందేందుకు చైనా ప్రయత్నిస్తోంది. దీని వల్ల ఇతర అంశాలు మరుగున పడుతున్నాయి. ఇందువల్ల దేశ ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది అని మాయావతి అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ వెనుకబడిన వర్గాల ప్రజలు, ఆదివాసీలు, కన్వర్టెడ్ మైనారిటీల ప్రయోజనాల కోసం ఏర్పడిన పార్టీ అని చెప్పారు. తాము పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందని, ఆయా వర్గాల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పని చేసి ఉంటే తాము పార్టీ పెట్టాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. తాము బీజేపీకి కానీ, కాంగ్రెస్‌కు కానీ ఎలాంటి ఆటవస్తువు కామని, జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన స్వతంత్ర పార్టీ అని స్పష్టం చేశారు.

కోవిడ్-19 పరిస్థితుల్లో సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చిన వలస కార్మికులు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లేవారని, వారికి కాంగ్రెస్ ఎలాంటి సాయం చేయలేదని అన్నారు. అందువల్లే వాళ్లు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. ఈ పరిణామాలను బీజేపీ గుణపాఠంగా తీసుకుని కాంగ్రెస్ చేసిన తప్పులే పునరావృతం చేయరాదని, ఇండియాను ఆత్మనిర్భర్ భారత్‌గా తీర్చిదిద్దేందుకు మాటల కంటే చేతలే ముఖ్యమని హితవు పలికారు.


Tags :
|
|

Advertisement