Advertisement

  • బీఎస్ఐ సైనికులు ఎదురు కాల్పులు ఐదుగురు చొరబాటుదార్ల హతం

బీఎస్ఐ సైనికులు ఎదురు కాల్పులు ఐదుగురు చొరబాటుదార్ల హతం

By: chandrasekar Sat, 22 Aug 2020 3:01 PM

బీఎస్ఐ సైనికులు ఎదురు కాల్పులు ఐదుగురు చొరబాటుదార్ల హతం


బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పంజాబ్ సరిహద్దుల్లోని ఐదుగురు చొరబాటుదారులను కాల్చి చంపింది. పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద శనివారం ఉదయం సైన్యం ఐదుగుర్ని కాల్చి చంపినట్టు ఉన్నతాధికారి తెలిపారు. దేశంలోకి చొరబడేందుకు తరాన్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి ప్రయత్నిస్తుండగా బీఎస్ఎఫ్‌కి 103 బెటాలియన్ దళాలు అప్రమత్తమయ్యాయని తెలిపారు.

వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. ఈ సమయంలో సైన్యంపై చొరబాటుదారులు కాల్పులు జరిపారని, ఆత్మరక్షణ కోసంం బీఎస్ఐ సైనికులు ఎదురు కాల్పులు జరిపినట్టు వివరించారు. ఈ కాల్పుల్లో ఐదుగురు చొరబాటుదారులు హతమైనట్టు బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు.

శనివారం తెల్లవారుజామున 4.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నట్టు మరో అధికారి పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ముమ్మర గాలింపు చర్యలు జరుగుతున్నాయని, ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నాయి. నిరంతరం కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉగ్రవాదులను దేశంలోకి ఎగదోసే ప్రయత్నాలు చేస్తోంది. డ్రోన్లతో దాడులకు కూడా ప్రయత్నిస్తోంది.

Tags :
|

Advertisement