Advertisement

  • బీఎస్ఎఫ్ మరియు ఒడిశా పోలీసుల గాలింపు చర్యల్లో మావోయిస్టుల డంప్ స్వాధీనం

బీఎస్ఎఫ్ మరియు ఒడిశా పోలీసుల గాలింపు చర్యల్లో మావోయిస్టుల డంప్ స్వాధీనం

By: chandrasekar Fri, 13 Nov 2020 10:55 AM

బీఎస్ఎఫ్ మరియు ఒడిశా పోలీసుల గాలింపు చర్యల్లో మావోయిస్టుల డంప్ స్వాధీనం


బీఎస్ఎఫ్ మరియు ఒడిశా పోలీసుల గాలింపు చర్యల్లో మావోయిస్టుల డంప్ స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల‌కు చెందిన డంప్‌ను గురువారం ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా పోలీసుల‌కు అందిన ముంద‌స్తు స‌మాచారం ప్ర‌కారం మ‌ల్క‌న్‌గిరి జిల్లా క‌టాఫ్ ఏరియాలోని జొడొంబో పోలీసుస్టేష‌న్ ప‌రిధిలోని అర‌ప‌ద‌ర్‌-ఆండ్రాప‌ల్లి అట‌వీప్రాంతంలో గాలింపు చ‌ర్య‌ల‌ను నిర్వ‌హిస్తున్న బీఎస్ఎఫ్, ఒడిశా పోలీసుల‌కు మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను క‌నుక్కున్నారు. ఇందులో చాలా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

వీరు గుర్తించిన ఈ డంప్‌లో రెండు మందుపాత‌ర‌లు, 14 హ్యాండ్ గ్రైనెడ్‌లు, 13 ఎల‌క్ట్రిక్ డిటోనేట‌ర్స్‌, 9 ఎంఎం పిస్ట‌ల్ కు చెందిన 55 రౌండ్స్‌ బుల్లెట్స్, 303 తుపాకీ చెందిన 93 రౌండ్స్ బుల్లెట్స్ ఉన్న‌ట్లు ఒడిశా మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేష్ కిల్లారి తెలిపారు. ఏవోబీ ఎస్‌జ‌డ్‌సీకు చెందిన మావోయిస్టులకు చెందిన సామాగ్రిగా గుర్తించామ‌ని వీటిని అమాయ‌కులైన గిరిజ‌నుల‌ను ల‌క్ష్యంగా చేసుకోవ‌డంతో బాటు గాలింపునకు వ‌చ్చే బ‌ల‌గాల‌ను లక్ష్యంగా చేసుకుని వీటిని వాడ‌టానికి దాచిపెట్టార‌ని మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం దీనిని స్వాదీనం చేసుకోవడంతో పెను ముప్పును నివారయించగలిగినట్లు తెలిపారు.

Tags :
|
|
|

Advertisement