Advertisement

  • విజ‌య్ మాల్యాను అప్పగించనున్న బ్రిట‌న్ ప్ర‌భుత్వం

విజ‌య్ మాల్యాను అప్పగించనున్న బ్రిట‌న్ ప్ర‌భుత్వం

By: chandrasekar Fri, 05 June 2020 5:42 PM

విజ‌య్ మాల్యాను అప్పగించనున్న బ్రిట‌న్ ప్ర‌భుత్వం


బ్రిట‌న్ ప్ర‌భుత్వం విజ‌య్ మాల్యాను భార‌త్‌కు అప్ప‌గించ‌నున్న‌ది. మాల్యాను త్వ‌ర‌లోనే భార‌త్‌కు తీసుకురానున్నారు. దీని కోసం న్యాయ ప్ర‌క్రియ పూర్తి అయిన‌ట్లు తెలుస్తోంది. ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల‌కు వేల కోట్ల రుణం ఎగ్గొట్టి ప‌రారీలో ఉన్న విజ‌య్ మాల్యాను త్వ‌ర‌లోనే భార‌త్‌కు తీసుకువ‌స్తార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

త‌న‌ను భార‌త్‌కు అప్ప‌గించ వ‌ద్దు అంటూ విజ‌య్ మాల్యా పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను లండ‌న్ కోర్టు మే 14వ తేదీన కొట్టివేసిన విష‌యం తెలిసిందే. చీటింగ్‌, నేర కుట్ర‌, దుర్వినియోగం లాంటి కేసుల్లో విజ‌య్ మాల్యాపై సీబీఐ విచార‌ణ కొన‌సాగిస్తున్న‌ది. అధికారుల‌ను మ‌భ్య‌పెట్టి మాల్యా ఐడీబీఐ బ్యాంకు వ‌ద్ద 900 కోట్ల రుణం తీసుకుని ఎగ‌వేశారు.

అయితే త‌న బాకీల‌ను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాని, నూరు శాతం వాటిని క‌ట్టేస్తాన‌ని మాల్యా ఇటీవ‌ల ఓ ట్వీట్‌లో వెల్ల‌డించారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో 20 ల‌క్ష‌ల కోట్ల‌తో మోదీ ప్ర‌క‌టించిన ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ప్యాకేజీని స్వాగ‌తించిన మాల్యా తాను చెల్లిస్తాన‌న్న బాకీల‌ను ప్ర‌భుత్వం విస్మ‌రిస్తోంద‌ని విమ‌ర్శించారు. మాజీ ఎంపీ, యునైటెడ్ స్పిరిట్స్ అధినేత అయిన మాల్యాపై సుమారు 130 కోట్ల డాల‌ర్ల మ‌నీ ల్యాండ‌రింగ్ కేసు న‌మోదైంది. వ్య‌క్తిగ‌త కార‌ణాలు చూపుతూ ఆయ‌న 2016లో దేశం విడిచి వెళ్లారు.


Tags :
|

Advertisement