Advertisement

  • ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న బ్రిటన్ బామ్మ...

ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న బ్రిటన్ బామ్మ...

By: chandrasekar Tue, 08 Dec 2020 6:53 PM

ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న బ్రిటన్ బామ్మ...


క్లినికల్ ట్రయల్స్ తర్వాత ప్రపంచంలోనే వ్యాక్సిన్ వేయించుకున్న తొలి వ్యక్తిగా బ్రిటన్‌కు చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు ఘనత సాధించారు. బ్రిటన్‌లో ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి లభించిన విషయం తెలిసిందే. దీంతో టీకా తొలి డోస్‌ను బ్రిటన్‌కు చెందిన మార్గారెట్ కీనన్ (90)కు వేశారు. స్థానిక కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 6.30 గంటలకు మధ్య ఇంగ్లాండ్‌లోని కొవెంట్రీ స్థానిక ఆస్పత్రిలో ఆమెకు టీకా తొలి డోస్ ఇచ్చారు. మరో వారం రోజుల్లో ఆమె 91 పడిలోకి అడుగుపెట్టనున్నారు. ప్రపంచంలోనే తొలి టీకాను తనకే ఇవ్వడం ఎంతో గర్వంగా భావిస్తున్నానని కీనన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘పుట్టిన రోజుకు ముందు ఇది నేను కోరుకునే ఉత్తమ బహుమతి. ఎందుకంటే కొత్త సంవత్సరంలో నా కుటుంబం, స్నేహితులతో ఎక్కువ సమయం గడపడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు.

బ్రిటన్ ప్రభుత్వం ఫైజర్-బయోఎన్‌టెక్ టీకా వ్యాక్సినేషన్‌ కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. సాధారణ ప్రజానీకానికి వ్యాక్సినేషన్ ప్రారంభించిన తొలి పశ్చిమ దేశంగా బ్రిటన్ నిలిచింది. ఐరోపా దేశాల్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న విషయం తెలిసిందే. అత్యంత శీతల స్టోరేజ్, లాజిస్టిక్స్ ఇబ్బందులతో ప్రస్తుతానికి టీకా వినియోగాన్ని పరిమితం చేస్తున్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థలు కూలిపోయి, 1.5 మిలియన్ల మందినిపైగా పొట్టనబెట్టుకున్న మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రపంచానికి ఆశలు రేకిత్తిస్తోంది. కాగా, భారత్‌లోనూ అత్యవసర వినియోగం కింద టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ ఫైజర్‌ ఇండియా, సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థలు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

Tags :
|

Advertisement