Advertisement

  • ఐసొలేషన్ కు వెళ్లకపోతే భారీ జరిమానా ..సంచలన నిర్ణయం తీసుకున్న ఇంగ్లాండ్

ఐసొలేషన్ కు వెళ్లకపోతే భారీ జరిమానా ..సంచలన నిర్ణయం తీసుకున్న ఇంగ్లాండ్

By: Sankar Tue, 29 Sept 2020 11:05 AM

ఐసొలేషన్ కు వెళ్లకపోతే భారీ జరిమానా ..సంచలన నిర్ణయం తీసుకున్న ఇంగ్లాండ్


కరోనా కేసులు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యింది. ఇంగ్లాండ్ లో సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో ఆ దేశం అప్రమత్తం అయ్యింది. ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా టెస్ట్ అండ్ ట్రేస్ విధానాన్ని అమలులోకి తెచ్చింది.

ఇందులో భాగంగా పాజిటివ్ గా నిర్ధారణ జరిగిన వారు ఐసోలేషన్ కి వెళ్ళాలి. ఐసోలేషన్ కు నిరాకరిస్తే చట్టపరంగా వెయ్యి నుంచి 10వేల పౌడ్లు జరిమానా విధిస్తామని ప్రకటించింది. జాతీయ భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఐసోలేషన్ లో 500 పౌండ్లు నగదు ఇవ్వనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. బ్రిటన్ లో కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి తిరిగి ఉధృతి మొదలైంది. దీంతో సెకండ్ వేవ్ మొదలైనట్టు బ్రిటన్ ప్రభుత్వం గుర్తించి అప్రమత్తం అయ్యింది..

కాగా కరోనా చైనాలో మొదలయి దాదాపు పదినెలలు కావొస్తున్నా ఇంకా చాల దేశాలలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలోనే నమోదు అయితుంది..ముఖ్యంగా అమెరికా , ఇండియా , బ్రెజిల్ , ఇంగ్లాండ్ వంటి దేశాలలో కరోనాకేసులు అత్యధిక సంఖ్యలో నమోదు అయితున్నాయి..న్యూజిలాండ్ వంటి దేశాలలో కరోనా తగ్గినప్పటికీ మల్లీ సెకండ్ వేవ్ మొదలయితుంది..దీనితో అన్నిదేశాలూ అప్రమత్తం అయితున్నాయి ..ఇండియాలో కూడా రాజధాని ఢిల్లీలో సెకండ్ వేవ్ మొదలయింది..

Tags :

Advertisement